Breaking News

మైనర్‌పై లైంగిక దాడి, జైలుకెళ్లి వచ్చాక పెళ్లి.. భార్యపై అనుమానంతో

Published on Fri, 09/02/2022 - 13:33

సాక్షి, హైదరాబాద్‌: కుటుంబ కలహాలతో భార్యపై భర్త దాడి చేయడంతో త్రీవంగా గాయపడిన ఆమె మృతి చెందింది. ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన పరిధిలో బుధవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నందనవనంలో ఉండే సబా ఫాతీమా(22) మైనర్‌గా ఉన్నపుడు బైరామల్‌గూడలోని అల్లాఫ్‌ నగర్‌లో ఉంటూ కూలీ పని చేసే పాతనేరస్తుడు దాసరి సురేందర్‌ (30) ఆమెపై అత్యాచారం చేశాడు.  కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మీర్‌పేట పోలీసులు అతడిపై ఫోక్సో తదితర కేసులు నమోదు చేసి జైలుకు పంపారు.

జైలు నుంచి విడుదలైన తర్వాత బాధితురాలినే సురేందర్‌ కులాంతర వివాహం చేసుకున్నాడు. సురేందర్‌ తల్లి యాదమ్మ, భార్య సబా ఫాతీమాతో కలిసి అల్లాఫ్‌నగర్‌లో ఉంటున్నాడు. వీరికి 9 నెలల పాప ఉంది. 2021 డిసెంబర్‌లో బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దొంగతనం కేసులో మళ్లీ అరెస్టయి జైలుకు వెళ్లాడు.  జైలు నుంచి వచ్చినప్పటి నుంచీ రోజూ తాగి ఇంటికి వచ్చేవాడు. కూతురు పుట్టడంతో భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ కొట్టేవాడు. ఇదే క్రమంలో బుధవారం భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది.

సురేందర్‌ భార్యపై చేయి చేసుకోవడం కింద పడి తీవ్ర రక్తస్రావమైంది. ఫాతీమా మెట్లపై నుంచి కిందపడి గాయపడిందని ఆమె తల్లిదండ్రులకు సురేందర్‌ సమాచారం ఇచ్చాడు. స్థానికులు వెంటనే ఫాతీమాను చికిత్స నిమిత్తం వనస్ధలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు  అప్పటికే ఆమె చనిపోయిందని చెప్పారు. మృతురాలి తల్లి షబానా బేగం తన కుతురును అల్లుడు సురేందర్, ఆమె తల్లి యాదమ్మ కలిసి హత్య చేశారని ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. 
చదవండి: నీ కుమారుడి కంటే దారణంగా చంపుతాం.. సిద్ధూ తండ్రికి బెదిరింపులు

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)