విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
Breaking News
కారు కింద పడి.. 3 కి.మీ. ఈడ్చుకెళ్లి
Published on Sat, 02/18/2023 - 06:00
బుదాన్ (యూపీ): దేశ రాజధాని ఢిల్లీలో కారు కింద పడ్డ యువతిని ఈడ్చుకొని కొన్ని కిలోమీటర్లు వెళ్లిన తరహా ఘటనలు తరచూ జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్‌కి వెళ్లిన ఒక యువకుడి నిండు ప్రాణాలు ఇలాగే బలయ్యాయి. యూపీ పోలీసులు అందించిన వివరాల ప్రకారం సిరసోలా గ్రామానికి చెందిన 22 ఏళ్ల వయసున్న ఉమేష్ కుమార్ శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్‌కు బయల్దేరగా వెనుక నుంచి వచ్చిన కారు అతనిని ఢీకొట్టింది.
కారు బోనెట్‌పైకి ఎగిరి మళ్లీ కిందపడిన కుమార్ ముందువైపునున్న ఎడమ చక్రంలో ఇరుక్కుపోయారు. అయినా కూడా కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా 3 కి.మీ. ప్రయాణించాడు. దీనిని చూసిన స్థానికులు ఆ కారుని వెంబడించి అతనిని పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ కుమార్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు డ్రైవర్‌ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
Tags : 1