Breaking News

సినిమా చూసేందుకు వెళ్లి మృత్యుఒడిలోకి.. ఏమైందంటే?

Published on Mon, 08/28/2023 - 18:46

లక్నో: ఇటీవలి కాలంలో గుండెపోటు కారణంగా చూస్తుండగానే అకస్మాత్తుగా ఎంతోమంది చనిపోయారు. ఉన్నట్టుండి కూర్చున్న, నిలుచున్న చోటే కుప్పకూలిన ఘటనలు ఎన్నో ఘటనలు సోషల్‌ మీడియాలో చనిపించాయి. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన వ్యక్తి ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఉన్నచోటే కుప్పకూలి మృతిచెందాడు. 

వివరాల ప్రకారం.. యూపీలోని లఖింపుర్‌ఖేరీలో సినిమా చూసేందుకు వెళ్తున్న ఓ యువకుడు సినిమా హాలులో నడుస్తుండగానే కుప్పకూలిపోయాడు. కాగా, ఇటీవల విడుదలైన గదర్‌ -2 సినిమాను చూసుందుకు థియేటర్‌లోకి వస్తున్న 35 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. శనివారం రాత్రి 7.43 గంటల సమయంలో ఒక్కసారిగా ఫ్లోర్‌పై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు థియేటర్‌లో ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనలో మృతిచెందిన వ్యక్తిని అక్షత్‌ తివారీగా గుర్తించారు. 

అయితే, తివారీ.. థియేటర్‌ వద్ద ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ సినిమా హాలు మెట్లు ఎక్కి పైకి వచ్చాడు. అనంతరం.. ఓ స్టాల్‌ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో అతడి ముందు ఇద్దరు యువకులు నడుస్తున్నట్టుగా సీపీ టీవీ వీడియోలో రికార్డు అయ్యింది. అతడు కుర్చీల వద్ద పడిపోవడాన్ని గమనించిన మరికొందరు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో వెంటనే తివారీని ఆసుపత్రికి తరలించారు. తివారీని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఇది కూడా చదవండి: విమానంలో అద్భుతం.. పసిబిడ్డ ప్రాణాలు కాపాడిన ఎయిమ్స్ డాక్టర్లు

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)