Breaking News

కుక్కపిల్లను కొట్టిచంపాడు

Published on Mon, 12/11/2023 - 05:52

భోపాల్‌: అటుఇటు తిరుగుతూ తన వద్దకు వచి్చన కుక్కపిల్లను ఓ వ్యక్తి అత్యంత నిర్దయగా నేలకేసి కొట్టి చంపాడు. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో జరిగిన ఈ దారుణం అక్కడి సీసీటీవీలో రికార్డయింది. వీడియో వైరల్‌గా మారడంతో వేలాది మంది.. ఆ వ్యక్తి కర్యశ చర్యపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో అరెస్ట్‌కు ఆదేశాలిచ్చారు.

కఠిన శిక్ష పడేలాచూస్తామని ముఖ్యమంత్రి శివరాజ్‌ హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం గుణ జిల్లాలోని సుభాష్‌ కాలనీలో జరిగిన ఈ దారుణ ఘటన తాలూకు వీడియో చూసిన వారంతా వ్యక్తిని తీవ్రంగా శిక్షించాలంటూ పోస్టులు పెట్టారు. దాదాపు 30 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి ఆరుబయట కూర్చోగా అక్కడికి రెండు బుల్లి కుక్కపిల్లలు తిండి కోసం తచ్చాడుతూ వచ్చాయి. వాటిల్లో ఒకటి ఇతడి సమీపానికి రాగానే వెంటనే ఆగ్రహంతో కుక్క పిల్లను ఎత్తిపట్టుకుని నేలకేసి బలంగా కొట్టాడు. అక్కడి నుంచి లేచి వచ్చి దానిని కుడికాలితో పలుమార్లు తొక్కిచంపాడు. ఈ హృదయవిదారక దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ‘‘ఇది నా హృదయాన్ని కలిచివేసింది. అతనికి కఠిన శిక్ష పడేలా చేస్తాం’’ అని ముఖ్యమంత్రి చౌహాన్‌ ‘ఎక్స్‌’లో వ్యాఖ్యానించారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)