కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్
Breaking News
‘నువ్వు, నీ కడుపులోని బిడ్డ ఇద్దరు చచ్చిపోండి’
Published on Wed, 03/10/2021 - 12:08
సాక్షి, మీర్‌పేట: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిని యువకుడిపై మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వికారాబాద్‌కు చెందిన కర్రె అనూష (22) 2017 సంవత్సరంలో ఒవైసీ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ 3వ సంవత్సరం చదువుతుండగా హస్తినాపురంకు చెందిన విజయ్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని అనూషను నమ్మించాడు. ఈ క్రమంలో అనూష గర్భం దాల్చడంతో విజయ్‌కుమార్ పెళ్లి చేసుకోకపోగా ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
తాజాగా ఓ దొంగతనం కేసులో అనూష జైలుకు వెళ్లడంతో అప్పటి నుంచి విజయ్‌కుమార్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి కనిపించకుండా పోయాడు. జైలు నుంచి బయటకు వచ్చిన అనూష వెంటనే విజయ్‌కుమార్ తల్లిదండ్రులకు ఫోన్ చేయగా నువ్వు, నీ కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు చచ్చిపోండని బెదిరించారు. విజయ్‌కుమార్ స్పందించకపోవడంతో అనూష మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి:
చంపి అయినా ‘పరువు’ కాపాడుకోవాలనుకుని..
బయటకు వెళ్లకుండా తల వ్రెంటుకలను కట్ చేయించి..
Tags : 1