Breaking News

గ్యాంగ్‌రేప్‌ నిందితులకు బెయిల్‌.. కార్లు, బైకులతో విజయోత్సవ ర్యాలీ

Published on Fri, 05/23/2025 - 19:20

సాక్షి,బెంగళూరు: ఓ మహిళపై సామూహిక అత్యాచారం. ఆపై జైలు శిక్ష, బెయిల్‌పై విడుదల. ఈ తరహా దారుణాల నిందితులు చేసిన తప్పుకు పశ్చాతాపానికి గురవుతుంటారు. సమాజంలో తిరగలేక సిగ్గుతో తలదించుకుంటుంటారు. కానీ కర్ణాటక కేసు నిందితులు అందుకు భిన్నంగా వ్యవహించారు. బెయిల్‌ రావడంతో బైక్‌, కార్లలో తిరుగుతూ విజయోత్సవ ర్యాలీలు జరిపారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఇటీవల,గ్యాంగ్‌ రేప్‌ కేసులో ఏడుగురు ప్రధాన నిందితులు అఫ్తాబ్‌, మదర్ సాబ్‌, సమీవుల్లా, మొహమ్మద్ సాదిక్‌, తౌసీఫ్‌, రియాజ్‌, షోయిబ్‌లకు కర్ణాటక హవేరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌ అనంతరం, చేసిన తప్పుకు తలదించుకోవాల్సింది పోయి సంబరాలు చేసుకున్నారు. వీధుల్లో కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించారు. ఈ విజయోత్సవ ర్యాలీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

కేసు పూర్వా పరాల్ని పరిశీలిస్తే.. 
2024 జనవరి 8న కర్ణాటకలోని హవేరీ జిల్లాలో హనగర్‌కు చెందిన ఓ హోటల్‌ గదిలో దారుణం జరిగింది. నిందితులు హోటల్‌ గదిలోకి చొరబడి  ఓ జంటపై దాడి చేశారు. అనంతరం బాధితురాల్ని స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

తాజాగా, ఆ కేసులో ఏడుగురు ప్రధాన నిందితలు బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్‌ రావడంపై నిందితులు హవేరి జిల్లా అక్కి అలూరు పట్టణంలో పెద్ద ఎత్తున మోటార్ బైక్‌లు, కార్లు, డీజే మ్యూజిక్‌తో కూడిన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. చిరునవ్వుతో చేతులు ఊపుతూ, విజయోత్సవ సంకేతాలిచ్చిన దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాయి. 

బాధితురాలు ఓ మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారు. ఆమె కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తిని ప్రేమించింది. ఈ క్రమంలో ఆమె, తన ప్రియుడితో కలిసి 2024 జనవరి 8న హనగల్‌కు చెందిన ఓ హోటల్‌లో రూమ్ తీసుకున్నారు. బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టారు.  

అయితే  జనవరి 11న న్యాయమూర్తి ఎదుట బాధితురాలు స్టేట్‌మెంట్  ఇచ్చారు. దీంతో న్యాయమూర్తి ఆదేశాలతో ఈ కేసులో పోలీసులు మొత్తం 19 మందిని అరెస్ట్ అయ్యారు. వీరిలో 12 మందిని దాదాపు 10 నెలల క్రితమే బెయిల్‌పై విడుదల చేశారు. కానీ,  ఏడుగురు ప్రధాన నిందితులు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు.  ఇదే కేసులో ఆ ఏడుగురికి న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రావడంతో నిందితులు బైక్‌లు,కార్లలో ర్యాలీతో సంబరాలు  చేసుకున్నారు.

ఈ ఘటనపై నెటిజన్లు, స్థానికులు.. న్యాయం గెలవాలన్న ఆశతో బాధితురాలు ఎదురుచూస్తున్న సమయంలో నిందితులు చేసిన విజయోత్సవాల ర్యాలీ బాధితురాలిని మరింత మానసికంగా దెబ్బతీసేలా ఉందని విమర్శిస్తున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)