Breaking News

ముస్లిం యువతిని ప్రేమించడమే ఆ యువకుడికి శాపమైందా?

Published on Fri, 05/27/2022 - 20:38

బెంగళూరు: వేరే మతానికి చెందిన అమ్మాయిని ప్రేమించడమే ఆ యువకుడి పాపమైంది. ప్రేమించిన అమ్మాయితో జీవితాంతం సంతోషంగా ఉండాలనుకున్న అతని ఆశాలు అడియాశాలయ్యాయి. ఎంతో అందంగా ఊహించుకున్న భవిష్యత్తును మధ్యలోనే సమాధి చేశారు. ఎదిగి వచ్చిన కొడుకును దూరం చేసి కన్నతల్లికి కడుపుకోత మిగిల్చారు. ముస్లిం యువతితో సన్నిహితంగా ఉంటున్నాడని దళిత యువకుడిని హత్య చేశారు. ఈ అమానుష ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

కాలబురాగి(గుల్బర్గా) వాడిటౌన్‌లోని భీమా నగర్‌లో లేఅవుట్‌లో నివిస్తున్న 25 ఏళ్ల విజయ్‌ కాంబ్లే, ముస్లిం యువతిని ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ ప్రేమ విషయం యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. తన సోదరితో దూరంగా ఉండాలని యువతి సోదరులు విజయ్‌ను పలుమార్లు హెచ్చరించారు. అయినా యువకుడి  ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఎలాగైనా విజయ్‌ను అంతమొందించాలని ముస్లిం యువతి కుటుంబ సభ్యులు పథకం పన్నారు. ఈ క్రమంలో శుక్రవారం విజయ్‌ను అడ్డగించి కత్తితో పొడిచి చంపి అక్కడి నుంచి పరారయ్యారు.
చదవండి: Hyderabad: ప్రియురాలిపై మాజీ ప్రియుడి ఘాతుకం.. నడిరోడ్డుపై

త‌న కుమారుడిని ముస్లిం యువ‌తి సోద‌రులే హ‌త్య చేశార‌ని మృతుడి తల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులు షాహుద్దీన్‌, నవాజ్‌ అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరితోపాటు ఇరు కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు. అయితే యువతి సోదరులు తమ కొడుకును పలుమార్లు బెదిరించారని మృతుడి తల్లి పేర్కొంది. తన చెల్లెలితో రిలేషన్‌షిప్‌ను వదులుకోవాలని లేకుంటే చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు. 

ఆమె మాట్లాడుతూ.. ‘విజయ్‌కు ఫోన్‌ కాల్‌ రావడంతో ఇంటినుంచి బయటకు వెళ్లిపోయాడు. తను ఎవరితో మాట్లాడాడో కూడా నాకు తెలీదు. తరువాత విజయ్‌ను ఎవరో కొట్టారని మాకు కాల్‌ వచ్చింది. వెంటనే తన వద్దకు పరిగెత్తాము. అప్పటికే మా అబ్బాయి మెడపై కత్తితో పొడిచి చంపారు.  ఈ సంఘటనకు ముందు ఎలాంటి గొడవలు జరగలేదు. యువతి సోదరుడు మాత్రం ఒకసారి ఇంటికొచ్చి.. ‘నీ కొడుక్కి మంచి బుద్ధులు నేర్పించు. లేకపోతే తన తల నరికి నీకు అప్పగిస్తాం’ అని బెదిరించి వెళ్లాడు’ అని విజయ్‌ తల్లి చెబుతూ కన్నీటి పర్యంతమైంది.
చదవండి: లైంగిక ఆరోపణలు.. మన‌స్తాపంతో మాజీ మంత్రి ఆత్మహత్య

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)