Breaking News

అత్యాచార ఆరోపణలు.. మూకదాడిలో యువకుడు మృతి

Published on Wed, 08/05/2026 - 11:55

ఛత్రా: జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో  ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒక మైనర్ బాలికపై అత్యాచారం, నిర్బంధం ఆరోపణల నేపథ్యంలో ఒక యువకునిపై ఆగ్రహించిన గ్రామస్తుల అతనికిపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం రాత్రి గ్రామానికి చెందిన ఒక బాలిక కనిపించకుండా పోయింది. మంగళవారం ఉదయం ఆమె ఆచూకీ లభించగా, సదరు యువకుడు తనను ఇంట్లో నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది.

దీంతో సుమారు 100 నుంచి 150 మంది గ్రామస్తులు యువకుడి ఇంటిని చుట్టుముట్టారు. ఆ యువకుడి తల్లిదండ్రులను కట్టేసి దాడికి పాల్పడ్డారు. వారిని రక్షించేందుకు ప్రయత్నించిన యువకుడిపై కర్రలు, రాళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ ఘటనపై మృతుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా 56 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (బీడీఓ) డియోలాల్ ఒరాన్ తెలిపారు. బాలికను వైద్య పరీక్షలకు తరలించామని, నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడవుతాయని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బలగాలను మోహరించారు.

ఇది కూడా చదవండి: జంతర్ మంతర్‌లో పెట్రోల్ బాంబులతో దాడికి ప్లాన్

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)