Breaking News

భుజం..భుజం..రాసుకుందని..

Published on Thu, 04/04/2024 - 08:09

హైదరాబాద్‌: చిన్న గొడవ కారణంగా చోటు చేసుకున్న ఘర్షణ ఒకరి హత్యకు దారితీసిన సంఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగి ంది. బాలంరాయి అంబేడ్కర్‌నగర్‌లో మంగళవారం రాత్రి జరిగిన  సంఘటన వివరాలు ఇలా ఉన్నా యి. అంబేద్కర్‌నగర్‌లో నివాసం ఉంటున్న రాజు, యాదమ్మ దంపతుల కుమారుడు బి.తరుణ్‌ (18) ఇంటర్మీడియట్  చదువుతున్నాడు. మంగళవారం రాత్రి అత ను స్థానిక శివాలయం సమీపంలోని చౌరస్తాలో ఉన్న ఓ పాన్‌ షాప్‌ వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ యువకుడి భుజం తరుణ్‌కు తగిలింది.

 దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో సదరు యువకుడు మరో ముగ్గురిని తీసుకువచ్చాడు. నలుగురూ కలిసి తరుణ్‌తో గొడవకు దిగారు. పరిస్థితి అదుపుతప్పి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో తమ గదికి వెళ్లిన వారు కత్తి తీసుకువచ్చి తరుణ్‌ను పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తల్లి యాదమ్మ పోలీసులకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

పోలీసుల అదుపులో నిందితులు.. 
బేగంపేట పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వరంగల్‌ జిల్లాకు చెందిన శివశంకర్, తరుణ్, జహీరాబాద్‌కు చెందిన పండు, సాయికిరణ్‌ తరుణ్‌ను హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు ఉద్యోగం కోసం నగరానికి వచ్చి ఈ నెల 1న అంబేడ్కర్‌నగర్‌లో గదిని అద్దెకు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల్లో ఒకరైన సాయికిరణ్, బీ తరుణ్‌ మధ్య మొదట గొడవ జరగ్గా, సాయికిరణ్‌ మిగతా ముగ్గురిని తీసుకురావడంతో గొడవ పెద్దదై హత్యకు దారితీసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)