Breaking News

టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి

Published on Mon, 05/20/2024 - 04:35

టెక్కలి: శ్రీకాకుళం జిల్లా కోట»ొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ చిన్నవెంకటాపురంలో టీడీపీ మూకలు అన్యాయంగా ఓ ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఈ పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్వస్థలం కావడం గమనార్హం. చిన్నవెంకటాపురం పోలింగ్‌ బూత్‌లో వైఎస్సార్‌సీపీ తరఫున తోట మాధవరావు ఏజెంట్‌గా ఉండడంతో టీడీపీ కార్యకర్తలు కక్ష పెంచుకుని అతని తండ్రి మల్లేష్‌ పై ఇటీవల దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆయన మృత్యువుతో పోరాడుతూ ఆదివారం ప్రాణాలు విడిచారు. 

అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడు హరివరప్రసాద్‌ డైరెక్షన్‌లో ఈ నెల 16న గ్రామ దేవత పండగను ఆసరాగా చేసుకుని మల్లేష్‌పై దాడి చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు పూతి లక్ష్మణరావు, పూతి భానుచందర్, పూతి కర్రెన్న, పూతి రమణ తదితరులు ఈ దాడికి పాల్పడ్డారు. ఇది అచ్చెన్నాయుడు చేసిన హత్యేనని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు.

 సుమారు 40 ఏళ్లుగా నిమ్మాడ పంచాయతీలో శాంతియుతంగా ఎన్నికలు జరగలేదని, ఈ సారీ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో అచ్చెన్నాయుడుకు ఓటమి భయం పట్టుకుందని పేర్కొన్నారు. నిమ్మాడ పోలింగ్‌ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ తరఫున బూత్‌ ఏజెంట్‌గా వ్యవహరించిన కింజరాపు అప్పన్నను చంపేస్తామని బెదిరించారని దువ్వాడ ఆరోపించారు. 

మల్లేష్‌ మృతికి బాధ్యులైన అచ్చెన్నాయుడు, హరివరప్రసాద్‌తో పాటు టీడీపీ వర్గీయులను అరెస్టు చేయాలని దువ్వాడ డిమాండ్‌ చేశారు. మృతుడి కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ హామీ ఇచ్చారు. 

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)