Breaking News

బాయ్‌ఫ్రెండ్‌ అని పొరపాటు.. నగ్న చిత్రాలు తొలగించాలంటే డబ్బులివ్వాలని..

Published on Fri, 06/03/2022 - 14:22

సాక్షి, హైదరాబాద్‌: నగ్న చిత్రాలు తొలగించాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్న ఓ యువకుడ్ని షీటీమ్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. గురువారం ఇన్‌స్పెక్టర్‌ కసపరాజు శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శివరామ్‌పల్లికి చెందిన మహమ్మద్‌ మోసిన్‌(22) పెయింటర్‌. దిల్‌సుఖ్‌నగర్‌ హాస్టల్లో ఉంటూ ఎమ్మెస్సీ చదువుతున్న ఓ యువతికి తన సెల్‌ఫోన్‌ నుంచి కాల్‌ చేసి తన పేరు రాజు అని పరిచయం చేసుకున్నాడు.

అయితే కొంత కాలం క్రితం తనతో విడిపోయిన తన బాయ్‌ఫ్రెండ్‌ రాజు అని నమ్మిన ఆమె అతనితో సంభాషించడం మొదలు పెట్టింది. అతని అభ్యర్థన మేరకు తన నగ్న చిత్రాలను పంచుకుంది. అయితే ఇద్దరు వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు అతడు బాయ్‌ ఫ్రెండ్‌ రాజు కాదని తెలిసి షాక్‌కు గురైంది. తన చిత్రాలు తొలగించాలని అతడిని కోరింది. ఫొటోలు తొలగించాలంటే డబ్బులు ఇవ్వాలని, లేకపోతే వాటిని వైరల్‌ చేస్తానని బెరింపులకు దిగాడు. దీంతో యువతి షీటీమ్‌ను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన షీటీమ్‌ పోలీసులు అతడిని పట్టుకుని మలక్‌పేట పోలీసులకు అప్పగించారు.  
చదవండి: సింగర్‌ సిద్ధూ హత్య కేసులో కీలక మలుపు

Videos

మావోయిస్టు కుంజమ్ హిడ్మా అరెస్ట్

వంశీ ఆరోగ్యంపై హైకోర్టు కీలక ఆదేశాలు

మహానాడులో నో ఫుడ్.. అచ్చెన్నాయుడు ఎందుకొచ్చారు అంటారా ఏంటి!

మహానేడులో చందాలు వసూలు.. కాక బాధపడ్తున్న ఇంద్రబాబు

తెలుగు టాప్ డైరెక్టర్స్ తో వెంకటేష్ వరుస సినిమాలు

మానవత్వం చాటుకున్న YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి

రాజమౌళి-మహేష్ బాబు సినిమాని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో..!

వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జగన్..

వెళ్లిపోకండయ్యా.. బతిమాలుకుంటున్న బాబు

మహానాడు ఎఫెక్ట్.. డిపోల్లో బస్సులు లేక ప్రయాణికుల అగచాట్లు

Photos

+5

జోగి రమేష్‌ తనయుడి వివాహ రిసెప్షన్‌.. నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీర్వాదం (ఫొటోలు)

+5

అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్‌ పెళ్లి ఎప్పుడంటే! (ఫొటోలు)

+5

వైఎస్ రాజారెడ్డి శత జయంతి.. దివ్యాంగ చిన్నారులతో వైఎస్‌ జగన్ (ఫొటోలు)

+5

కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు (ఫొటోలు)

+5

#GaddarAwards2024 : గద్దర్‌ అవార్డులు-2024 (ఫొటోలు)

+5

Miss world 2025 : ఆల్‌ ది బెస్ట్‌ మిస్‌ ఇండియా నందిని గుప్తా (ఫోటోలు)

+5

ట్రంప్‌ చెప్పేదొకటి.. చేసేదొకటి! మస్క్‌కు మండింది (చిత్రాలు)

+5

విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

'సీతా పయనం' మూవీ టీజర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

అనాథ పిల్లలతో ఆడి, పాడిన సుందరీమణులు..సెల్ఫీలు, వీడియోలు (ఫొటోలు)