Breaking News

వ్యక్తి దారుణ హత్య.. మృతదేహాన్ని మూటగట్టి ఇంటి ముందు పడేసి..

Published on Tue, 02/07/2023 - 14:31

సాక్షి, హైదరాబాద్‌: ఓ ఆటో డ్రైవర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. అంతమొందించిన దుండుగలే మృతదేహాన్ని గోనె సంచీలో మూటగట్టి ఇంటి ముందే మృతదేహాన్ని వదిలేయడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సంజయ్‌గాంధీనగర్‌లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం, వెలిమెల గ్రామానికి చెందిన సురేష్‌ (28) 2016లో రేణుకను ప్రేమ వివాహం చేసుకున్నాడు.

ఇద్దరు కొన్నేళ్ల నుంచి సంజయ్‌గాం«దీనగర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. వారికి ఆరేళ్లు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు ఆడ పిల్లలున్నారు. సురేష్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తుండగా రేణుక ఇంటి వద్దనే ఉంటోంది. ఆదివారం భర్త సురేష్‌ను ఆహారం తీసుకురమ్మని రేణుక బయటకు పంపింది. అర్ధరాత్రి అయినా సురేష్‌ ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్‌ సైతం ఇంట్లో వదిలి వెళ్లినట్లు గుర్తించారు.

సోమవారం తెల్లవారుజాము 5 గంటల ప్రాంతంలో ఇంటి ముందు గోనె సంచీలో మృతదేహం ఉన్నట్లు ఇంటి యజమాని గుర్తించాడు. దగ్గరకు వెళ్లి చూడగా సురేష్‌ రక్తపు మడుగులో ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. 

భార్యే హత్య చేయించిందా..! 
మృతుడు సురేష్‌ హత్య వెనుక భార్య హస్తమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరి కొంత మంది వ్యక్తులతో కలిసి రేణుక పథకం ప్రకారం హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో జీడిమెట్ల పోలీసులు రేణుకను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.  

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)