మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
కట్టుకున్న భార్యను స్నేహితులతో గడపాలని వేధించి..
Published on Thu, 06/10/2021 - 11:31
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): మద్యం తాగాలని, తన స్నేహితులతో గడపాలని భార్యను వేధిస్తున్న ఓ ఘరానా భర్త ఉదంతమిది. బెంగళూరు శివాజీనగరకు చెందిన వసీం షరీఫ్‌పై ఈ మేరకు భార్య ఫిర్యాదు చేసింది. మూడేళ్ల కిందట ఇతనికి దూరపు బంధువైన యువతితో పెళ్లయింది. కొంతకాలానికి గోవాటూర్‌కు తీసుకొని వెళ్లి తనతో మద్యం తాగాలని ఒత్తిడి చేయగా ఆమె ఒప్పుకోలేదని తీవ్రంగా కొట్టాడు. తరువాత హోటల్‌కు భోజనానికి వెళ్లి అక్కడ తన స్నేహితులతో కలసి గడపాలని భార్యను పీడించాడు.
ఆమె ససేమిరా అనడంతో మళ్లీ హింసించాడు. ఫలితంగా ఆమెకు అబార్షన్ అయ్యింది. గర్భందాల్చి ఇటీవల ఆడ బిడ్డ పుట్టగా వేధింపులు మరింతగా పెరిగాయని బాధితురాలు శివాజీనగర మహిళా పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో వాపోయింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
చదవండి: క్యాప్యూల్స్ రూపంలో బంగారం.. ముగ్గురు మహిళలు అరెస్ట్
Tags : 1