Breaking News

కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం.. పలువురి సజీవ దహనం

Published on Fri, 10/24/2025 - 05:33

కర్నూలు, సాక్షి: జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో ఓ ప్రైవేట్‌ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది(Kurnool Bus Accident). క్షతగాత్రుల్ని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, ఫైర్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నాయి. 

వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు నెంబర్‌ డీడీ01ఎన్‌9490 సుమారు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తోంది. కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్దకు చేరుకోగానే ఓ బైక్‌ను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఆ మంటలు బస్సు అంతటా వ్యాపించాయి. డ్రైవర్‌, హెల్పర్‌తో పాటు పలువురు ప్రయాణికులు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మరికొందరు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు.. అర్ధరాత్రి 3.30గం. ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. 

‘‘బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తోంది. బైక్‌ను ఢీ కొటటడంతో మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ గమనించి మరో డ్రైవర్‌ను నిద్ర లేపాడు. చిన్నపాటి ప్రమాదం అనుకుని వాటర్‌ బబుల్‌తో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, అంతలోనే మంటలు ఎక్కువయ్యేసరికి ప్రయాణికులను నిద్ర లేపాడు. ఎమర్జెన్సీ డోర్‌ బద్దలు కొట్టి మరికొందరు బయటపడ్డారు. గాయపడ్డవాళ్లు కర్నూలు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.  ఎంత మంది చనిపోయారన్నది ఇప్పుడే చెప్పలేం’’ అని కర్నూలు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ వెల్లడించారు. డ్రైవర్‌ పరారీలో ఉండగా.. స్పేర్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. 

👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)