Breaking News

ధూల్‌పేట గంజాయి డాన్‌ అంగూర్‌బాయి అరెస్టు

Published on Fri, 12/13/2024 - 11:10

సాక్షి, సిటీబ్యూరో: ఎక్సైజ్‌ పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న అంగూర్‌ బాయి ఎట్టకేలకు గురువారం కార్వాన్‌ ఎక్సైజ్‌ పోలీసులకు పట్టుబడింది. ధూల్‌పేట్‌ గంజాయి డాన్‌గా గుర్తింపు పొందిన అంగూర్‌బాయిని కార్వాన్‌ ప్రాంతంలో ఎస్టీఎఫ్, ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి అమ్మకాల్లో రూ.కోట్లకు పడగలెత్తిన అంగూర్‌ బాయిపై ధూల్‌పేట్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో 3 కేసులు, మంగల్‌హట్‌ పోలీస్‌స్టేషన్‌లో 4 కేసులు, ఆసిఫ్‌ నగర్, గౌరారం స్టేషన్లలో 10 కేసులు నమోదయ్యాయి. 

ఆయా కేసుల్లో అరెస్టు చేసేందుకు ఎక్సైజ్, పోలీసులు పలు మార్లు ప్రయతి్నంచినా ఆమె తప్పించుకు తిరుగుతోంది. ఇప్పటికే 13 కేసుల్లో నిందితురాలిగా జైలుకు వెళ్లి వచ్చిన ఆమె కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఆమె కుటుంబ సభ్యులపై కూడా పదుల సంఖ్యలో కేసులు ఉండటం గమనార్హం. ధూల్‌పేట్‌లో గంజాయి హోల్‌సేల్, రిటేల్‌ అమ్మకాల్లో అరితేరిన అంగూర్‌ బాయిని అపరేషన్‌ ధూల్‌పేట్‌లో భాగంగా అరెస్టు చేశారు. ఆమెను అరెస్ట్‌ చేసిన ఎక్సైజ్‌ పోలీసులను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డెరైక్టర్‌ కమలాసన్‌రెడ్డి అభినందించారు. అంగూర్‌బాయి అరెస్ట్‌తో ధూల్‌పేటలో ఎక్సైజ్‌ పోలీసులు భారీ విజయాన్ని నమోదు చేశారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)