Breaking News

ఈవీ బైక్‌ షోరూం యజమాని అరెస్టు

Published on Thu, 11/21/2024 - 08:41

బనశంకరి: బెంగళూరులోని రాజ్‌కుమార్‌ రోడ్డులో ఎలక్ట్రిక్‌ బైక్‌ షోరూం అగ్నిప్రమాదం ఘటనలో షోరూం యజమాని పునీత్‌, మేనేజర్‌ యువరాజ్‌ని బుధవారం రాజాజీనగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో మంటలు వ్యాపించి పెద్దసంఖ్యలో వాహనాలు, షోరూం మొత్తం కాలిపోయాయి. స్కూటర్లలోని బ్యాటరీలు పేలిపోవడంతో మంటలు ఇంకా విజృంభించాయి. మంటలను చూసి ప్రియా అనే ఉద్యోగిని తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. 

చివరకు మంటలు వ్యాపించి ఆమె సజీవ దహనమైంది. మరికొందరు బయటకు పరుగులు తీయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రియ బుధవారమే 27వ పుట్టిన రోజును జరుపుకోవాల్సి ఉంది, అంతలోనే ఘోరం జరిగింది. తన కూతురి భద్రత గురించి షోరూం సిబ్బంది పట్టించుకోలేదని ఆమె తండ్రి ఆర్ముగం విలపించాడు. పోలీసులు, ఫోరెన్సిక్‌ సిబ్బంది షోరూంని పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.

ఇష్టపడి కొంటే.. బూడిదైంది
కృష్ణరాజపురం: ఎంతో మురిపెంగా కొన్న ఈవీ స్కూటర్‌.. అగ్ని ప్రమాదంలో కాలిపోవడంతో ఆ దంపతుల బాధకు అంతులేదు. మంజునాథ్‌ అనే వ్యక్తి ఇటీవల రూ.70 వేలకు రాజాజీనగరలోని షోరూంలో ఓ బ్యాటరీ స్కూటర్‌ని కొన్నారు. పికప్‌ లేదని, సర్వీసింగ్‌ చేసివ్వాలని షోరూంలో వదిలారు. సర్వీసింగ్‌ చేసి బైక్‌ను సిబ్బంది సిద్ధం చేశారు. అయితే బైక్‌ను తీసుకెళ్లేలోగా మంగళవారం సాయంత్రం షోరూంలో అగ్నిప్రమాదం జరిగి ఆయన స్కూటర్‌ కూడా మంటల్లో కాలిపోయింది. తమకు షోరూంవారు పరిహారం ఇవ్వాలని బాధితులు డిమాండ్‌ చేశారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)