Breaking News

సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు అరెస్ట్‌ 

Published on Sat, 12/02/2023 - 03:12

సాక్షి, హైదరాబాద్‌: ‘నీది నాది ఒకే కథ’, గర్ల్‌ ఫ్రెండు’సినిమాల నిర్మాత అట్లూరి నారాయణరావును ఫాస్ట్‌ మూవింగ్‌ కన్‌జ్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) దందా కేసులో సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. కేసులో అసలు సూత్రధారి గుధే రాంబాబు హైదరాబాద్‌లో ఎఫ్‌ఎంసీజీ స్థాపించి మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ (ఎంఎల్‌ఎం) పేరిట అధిక వడ్డీలు ఆశ చూపి వందలాది మంది నుంచి రూ.540 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు.

బాధితుల ఒత్తిళ్ల నేపథ్యంలో రాంబాబు ఓ చార్టెట్‌ అకౌంటెంట్‌ ద్వారా నిర్మాత నారాయణరావును కలవగా, తన పలుకుబడితో కేసు లేకుండా చేస్తానని, ఇందుకు అన్ని ఖర్చులకు గానూ రూ.20 కోట్లు డిమాండ్‌ చేశాడు. బేరసారాల తర్వాత రూ.2 కోట్లకు అంగీకరించిన నారాయణరావు అడ్వాన్స్‌­గా రూ.10 లక్షలు, రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలు తీసుకున్నాడు.

ఆభరణాలను పాతబస్తీలో కరిగించి రూ.90 లక్షలకు అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. నారాయణరావును అరెస్టు చేసిన సీసీఎస్‌ పోలీసులు అదనపు విచారణ కోసం పోలీసు కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ శుక్రవారం నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత బంగారం రికవరీ చేయాలని భావిస్తున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)