Breaking News

భార్య వివాహేతర సంబంధం.. కువైట్‌ నుంచి వచ్చిన భర్తకు తెలియడంతో

Published on Thu, 06/16/2022 - 14:08

సాక్షి, నిజామాబాద్‌: వివాహేతర సంబంధంతో ఓ మహిళ కట్టుకున్న భర్తను చంపి, తర్వాత ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం చేసినట్లు సీపీ నాగరాజు వెల్లడించారు. బుధవారం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో మీడియా సమావేశంలో సీపీ మాట్లాడుతూ  ఆర్మూర్‌ మండలం మంథని గ్రామానికి చెందిన మైలారమ్‌ సదానంద్‌కు కవితతో 2007లో వివాహం కాగా వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు.  సదానంద్‌ బతుకు దెరువుకు కోసం కువైట్‌కు వెళ్లేవారన్నారు. 2008లో కవితకు అదే గ్రామానికి చెందిన మైలారం శేఖర్‌తో పరిచయమై తర్వాత వివాహేతర సంబంధానికి దారి తీసింది.

మే 5న కువైట్‌ నుంచి వచ్చిన సదానంద్‌కు భార్య  మధ్య డబ్బుల విషయంలో తగాదా రావడంతో పాటు భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసింది. దీంతో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో కవిత పుట్టింటికి వెళ్లిపోయింది. సదానంద్‌కు నవీపేట్‌ మండలం నాడాపూర్‌ గ్రామానికి చెందిన తోకల విజయతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో సదానంద్‌ను చంపేందుకు విజయతో కలిసి కవిత పథకం రచించింది.

పథకం ప్రకారం సదానందంను విజయ నిర్మా నుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మత్తులోకి వెళ్లేవరకు మద్యం తాగించింది. అనంతరం కవితకు ఫోన్‌ చేసింది. కవితతో పాటు శేఖర్, మరో వ్యక్తి రాజశేఖర్‌ వచ్చారు. తర్వాత అందరూ కలిసి సందానందం గొంతుకు స్కార్ఫ్‌ బిగించి  చంపివేశారని సీపీ వివ రించారు. హత్యను నిందితులు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు.  

సాంకేతిక పరిజ్ఞానంతో  కేసును చేధించి కవిత, వి జయ, శేఖర్, రాజశేఖర్‌ లను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించినట్లు సీపీ తెలిపారు. వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనంతో పాటు  నాలుగు సెల్‌ఫోన్లు, బంగారు చైన్‌ తదితర వాటిని  స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. స మావేశంలో అదనపు డీసీపీ నరేందర్, సీఐ జగడం నరేష్, ఎస్సై రాజారెడ్డి పాల్గొన్నారు. 

Videos

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)