Breaking News

బెయిల్‌ వస్తే ఓకే.. రాకుంటే ఎలా?

Published on Tue, 08/27/2024 - 03:14

సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ దాదాపు 150 రోజులకు పైగా తీహార్‌ జైలులో ఉన్న ఆమె బెయి లు పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కవిత బెయిల్‌ విషయంలో కౌంటర్లు దాఖలు చేసేందుకు ఆలస్యమెందుకంటూ ఈనెల 12న సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించింది. దీనితో కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోర్టును ఈడీ అడగ్గా.. విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది.

మంగళవారం కవిత బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు జరగనున్న నేప థ్యంలో.. కేటీఆర్, హరీశ్‌ తదితరులు సోమవారం ఢిల్లీ లో న్యాయవాదులతో భేటీ అయ్యా రు. 2 గంటల పాటు సుప్రీం కోర్టులో వాదించబోయే అంశాలపై చర్చించారు. కాగా, కోర్టు నిర్ణయం అనంతరం సాయంత్రం ఎమ్మెల్యేల అనర్హత అంశంపై మరోమారు న్యాయబృందంతో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బెయిల్‌పై ఆశాభావంతో..: కవిత 154 రోజుల నుంచి తీహార్‌ జైలులోనే ఉన్నారు. 

మంగళవారం సుప్రీంకోర్టులో ఆమె బెయిల్‌ పిటిషన్‌పై వాదనల నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్, హరీశ్‌లు న్యాయవాది మోహిత్‌రావు బృందంతో సుదీర్ఘమైన చర్చలు జరిపారు. ‘బెయిల్‌ వస్తే ఓకే.. ఒకవేళ బెయిల్‌ రాని పక్షంలో తదుపరి కార్యాచరణ ఏమిటి? న్యాయ పోరాటం ఎలా చేయాలి’అనే అంశాలపై చర్చించారు. బెయిల్‌పై కౌంటర్‌ దాఖలు విషయంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారంటూ ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఈ సారి కవితకు బెయిల్‌ వస్తుందని ఆమె కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్‌ నేతలు ఆశాభావంతో ఉన్నారు. 

సుప్రీంకోర్టులో కాసేపట్లో కవిత బెయిల్ - పిటిషన్పై విచారణ

మహిళగా కవితకు మినహాయింపు ఇవ్వండి
పీఎంఎల్‌ఏ సెక్షన్‌–45లోని కఠిన నిబంధనల నుంచి మహిళగా ఎమ్మెల్సీ కవితకు మినహాయింపు ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ్గ సుప్రీంకోర్టును కోరారు. ఇప్పటికే కవిత హైబీపీతో బాధ పడుతున్నారు. పదికేజీలకు పైగా బరువు తగ్గారు. మరోపక్క జ్వరంతో బాధపడుతూనే ఉన్నారు. వీటన్నింటికంటే ఆమె దీర్ఘకాలికంగా ఉన్న గైనిక్‌ సమస్యల వల్ల మరింత ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని న్యాయబృందం సుప్రీంకోర్టుకు నివేదించనుంది.

పీఎంఎల్‌ఏ సెక్షన్‌–45లోని కఠిన నిబంధనల నుంచి కవితకు మినహాయింపు ఇచ్చి బెయిల్‌ మంజూరు చేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించేందుకు ఆమె తరఫు న్యాయవాదులు సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా కవితకు ఉన్న అనారోగ్య సమస్యలపై ఢిల్లీ ఎయిమ్స్‌ ఇచ్చిన రిపోర్టులను ఈడీ అధికారులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం బెయిలు మంజూరు చేస్తుందా లేక వాయిదా వేస్తుందా అన్న అంశంపై బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)