Breaking News

కారు పార్కింగ్ వివాదం.. కొట్టుకున్న రెండు కుటుంబాలు..  

Published on Sun, 07/23/2023 - 15:54

న్యూఢిల్లీ: ఢిల్లీ సంత్ నగర్‌లోని ఒక అపార్ట్‌‌మెంట్లో పార్కింగ్ విషయమై నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఒక పెద్దాయనతో సహా ఆ కుటుంబంలోని మహిళలు పార్కింగ్ చేసిన వ్యక్తిని కర్రతో చితకబాదారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు వీరు అంతరించిపోతున్న భారతీయ కళకు ఊపిరి పోశారన్నారు. 

ఒకప్పుడు వీధుల్లో కుళాయి వద్ద సర్వసాధారణంగా బిందెలతో కొట్టుకోవడం చూసుంటాం. కానీ ఇప్పుడు నాగరికత పెరిగిన కారణంగా వీధిలోని సంప్రదాయాన్ని అపార్ట్‌‌మెంట్లకు బదిలీచేశారు. వేషధారణ అయితే మారింది కానీ గుణం మారలేదు. సంత్ నగర్‌లోని ఓ అపార్ట్‌‌మెంట్లో నివాసముండే దుష్యంత్ గోయెల్ కారు పార్కింగ్ చేశాడన్న కోపంతో ఆ కుటుంబ పెద్ద కనీసం వారించకుండా ఒక కర్రతో దాడి తెగబడ్డారు. 

పాపం భర్తను కాపాడేందుకు అతని భార్య మోనా గోయెల్ తోపాటు వారి కుమార్తె కౌశికి కూడా ఎంత అడ్డుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఆ పెద్దమనిషి ఇంట్లోని వారంతా మూకుమ్మడిగా దాడి చేయడంతో దుష్యంత్ కుటుంబంలోని అందరూ గాయపడ్డారు. అనంతరం దుష్యంత్ స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా పెద్దమనిషి దల్జీత్ సింగ్ అతని కుమారుడు హర్జాప్ ఇద్దరినీ అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. 

అదే కుటుంబంలోని ఆడవాళ్లు కూడా దాడిచేసినటు వీడియోలో స్పష్టంగా కనిపించడంతో వారిపైన కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. వారు ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా కోర్టు రెండుసార్లు నిరాకరించింది. ఒక్కరికి మాతం కోర్టు ఉపశమనం కలిగించినట్లు తెలుస్తోంది.  

ఇక ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఈ మధ్య  కార్ పార్కింగ్ వివాదాలు ఒకప్పటి బిందుల ఫైట్ కంటే రసవత్తరంగా సాగుతున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 

ఇది కూడా చదవండి: మణిపూర్‌లొ మరో ఘోరం.. ఫ్రీడం ఫైటర్‌ భార్య సజీవ దహనం

           

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)