Breaking News

ఒకరికి భార్య.. మరొకరికి లవర్‌.. ఢిల్లీలో జంట హత్యలు!

Published on Sun, 10/19/2025 - 20:39

వివాహేతర సంబంధం కారణంగా తన ప్రాణాలే కోల్పోయింది  ఓ మహిళ. తన భార్యను ప్రియుడు తన కళ్లముందే చచ్చేలా కొట్టడాన్ని భరించలేకపోయాడు భర్త. దాంతో ఆ ప్రియుడ్ని కూడా చంపేసి కసి తీర్చుకున్నాడు. భార్యను రక్షిద్దామని చేసిన ప్రయత్నంలో తీవ్ర కత్తిపోట్లకు గురైన భర్త కూడా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నైతికతను మరిచి వివాహేతర సంబంధం కొనసాగిస్తే ఎంతటి అనర్థాలకు దారి తీస్తుందో  ఈ ఘటన ద్వారా మరోసారి రుజువైంది. 

వివరాల్లోకి వెళితే..  సెంట్రల్‌ ఢిల్లీలో జరిగిన జంట హత్యలు కలకలం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఒకరు లవర్‌ కోసం, మరొకరు భార్య కోసం నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే రామ్‌ నగర్‌ ఏరియాలో షాలిని(22) తనది అంటూ స్థానికంగా క్రిమినల్‌గా పేరొందిన అశూ అలియాస్‌ శైలేంద్ర రోడ్డుపైనే ఆమెను అడ్డగించాడు. ఇందుకు కారణంగా  ఆ రౌడీ షీటర్‌తో షాలిని కొంతకాలం వివాహేతర సంబంధం నడపడమే.  భర్తతో కలిసి బయటకు వెళుతన్న సమయంలో ఇది చోటు చేసుకుంది. తామిద్దరికీ ఒక బిడ్డ కూడా పుట్టాడని, తనతోనే కలిసుండాలని ఆమెపై ఒత్తిడి చేశాడు.  

ఈ హఠాత్తు పరిణామంతో ఒక్కసారిగా భయపడిపోయిన షాలిని..  లవర్‌తో విభేదించింది. తాను భర్తతో ఉంటానని తెగేసి చెప్పేసింది. దాంతో ఆమెను నడిరోడ్డుపైనే విచక్షణారహితంగా కొట్టాడు ప్రియుడు. దాన్ని చూసి తట్టుకోలేకపోయిన భర్త ఆకాశ్‌.. భార్యను కాపాడుకునే యత్నం చేశాడు. 

ఒకవైపు భార్యను లవర్‌ చావబాదుతంటే అదే స్థాయిలో ప్రతిఘటించాడు. ఈ క్రమంలోనే ముగ్గురికి కత్తిపోట్లు బలంగా దిగాయి.  వీరు ముగ్గురు రక్తమడుగులో ఉన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఆస్పత్రికి తరలించారు.  కానీ షాలిని, ఆమె ప్రియుడు ఆశూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు డిల్లీ సెంట్రల్‌ డీసీపీ నిధిన్‌ వాల్సన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం భార్యను కాపాడే క్రమంలో తీవ్ర కత్తిపోట్లకు గురైన భర్త ఆకాశ్‌ పరిస్థితి కూడా విషమంగానే ఉందన్నారు.

అతిపెద్ద మ్యూజియంలో అతిపెద్ద చోరీ.. ఏడు నిమిషాల వ్యవధిలోనే..!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)