Breaking News

పుట్టినరోజునే భార్యను నడిరోడ్డుపై కాల్చి చంపిన కానిస్టేబుల్‌

Published on Mon, 07/13/2026 - 15:36

న్యూఢిల్లీ: భార్యాభర్తల బంధం అనేది నమ్మకం, ప్రేమ, పరస్పర గౌరవంపై నిలబడాలి. కానీ అదే బంధంలో కోపం, అనుమానం, అహంకారం ఉంటే ఏదో ఒక క్షణంలో జీవితం చీకటిగా మారుతుంది. ఒకప్పుడు జీవితాంతం తోడుగా ఉంటానని మాటిచ్చిన వ్యక్తే ప్రాణాలు తీసే స్థితికి చేరితే అంతకంటే హృదయవిదారకమైన విషాదం ఇంకొకటి ఉండదు. అలాంటి కన్నీరు తెప్పించే ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది.

నడిరోడ్డుపై భార్యను కాల్చి చంపాడు ఓ కానిస్టేబుల్‌. సోమవారం తెల్లవారుజామున తూర్పు ఢిల్లీలోని కల్యాణ్‌పురి ప్రాంతంలో దంపతులు స్కూటర్‌పై వెళ్తున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. భర్త మనీశ్‌ భాటి స్కూటర్‌ను ఆపగా ఇద్దరూ దిగిన తర్వాత కూడా వాగ్వాదం కొనసాగింది. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం.. భాటి తన భార్యపై కాల్పులు జరిపి ఆమెను రోడ్డుపైనే వదిలి అక్కడి నుంచి పారిపోయాడు.

రోడ్డుపక్కన మహిళ మృతదేహాన్ని దారిన వెళ్లే ఓ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ గుర్తించి వెంటనే ఆమెను తూర్పు ఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి (ఎల్‌బీఎస్‌) ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

మనీశ్‌ భాటి ఇటీవల తూర్పు ఢిల్లీలోని యాంటీ ఆటో థెఫ్ట్ స్క్వాడ్‌ (ఏఏటీఎస్‌)లో విధుల్లో చేరాడు. మృతురాలు భాటి భార్య ప్రియాంక (26)గా గుర్తించారు. ఆమె ఉపాధ్యాయురాలిగా పని చేసేది. ఈరోజు ప్రియాంక పుట్టినరోజు. నిందితుడి ఆచూకీ కనిపెట్టి అరెస్ట్ చేసేందుకు గాలింపు కొనసాగుతోంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)