Breaking News

కొడుకుని కాపాడి తండ్రి మృతి

Published on Sat, 09/09/2023 - 17:27

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ సంఘటన ఒకటి చేటు చేసుకుంది. కొడుకుపై దాడి జరుగుతోందని తెలుసుకుని అక్కడికి వెళ్లిన తండ్రిపై దుండగులు ఇటుకలతో దాడి చేశారు. 14 ఏళ్ల తన కుమారుడిని కాపాడుకున్న ఆ తండ్రి మాత్రం దాడిలో మృతిచెందాడు. ఢిల్లీలో భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతతో జీ20 సదస్సు నిర్వహిస్తున్న వేళ ఈ సంఘటన జరగడంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. 

ఢిల్లీ ఓక్లా ప్రాంతంలోని సంజయ్ కాలనీ ఏరియాలో నివాసముంటున్న మహమ్మద్ హనీఫ్(38) రోజు కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీసేవాడు. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో హనీఫ్ కుమారుడు తన బైక్ వీధిలోనే ఉండడంతో దాన్ని తెచ్చుకునేందుకు బయటకు వెళ్ళాడు. కానీ తన బైక్ మీద కూర్చుని కొంతమంది ఆకతాయిలు హనీఫ్ కుమారుడిని బైక్ తీసుకుని వెళ్లకుండా అడ్డుకున్నారు.

వారిని బైక్‌పై నుండి లేవమని కోరగా అందుకు వారు నిరాకరించి మైనర్ బాలుడితో వాగ్వాదానికి దిగారు. అది కాస్తా ఘర్షణకు దారితీసింది. ఎదో గొడవ జరుగుతున్నట్టు గ్రహించిన హనీఫ్ హుటాహుటిన బయటకు వచ్చి కుమారుడిని రక్షించే ప్రయత్నం చేయగా ఆ ఆకతాయి మూక హనీఫ్‌పై ఇటుకలతో దాడి చేసింది. తీవ్ర గాయాల పాలైన హనీఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను మృతి చెందినట్లు ప్రకటించారు డాక్టర్లు.

ఇది కూడా చదవండి: కృష్ణాష్టమి వేడుకల్లో రచ్చ చేసిన రాజకుటుంబీకురాలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)