Breaking News

ట్రేడింగ్‌ పేరుతో రూ.20లక్షలు స్వాహా 

Published on Thu, 03/14/2024 - 06:53

హిమాయత్‌నగర్‌:  ట్రేడింగ్‌లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి 60 ఏళ్ల వృద్ధుడిని సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు. నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపిన మేరకు.. నగరానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తికి వాట్సాప్‌లో స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడుల పేరుతో ఓ లింక్‌ వచి్చంది. ఆన్‌లైన్‌ ట్రేడింగ్, ఐపీఓలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. దీంతో బాధితుడు తన ఆధార్, పాన్‌ కార్డ్‌ వివరాలతో ట్రేడింగ్‌ అకౌంట్‌ను తెరిచాడు. మొదటగా సైబర్‌ కేటుగాళ్లు చెప్పిన విధంగా రూ.50,000 డిపాజిట్‌ చేశాడు. నకిలీ ట్రేడింగ్‌ ఖాతాలో లాభాలు వచి్చనట్లు చూపించారు.

అది నమ్మిన బాధితుడు బల్క్‌ ట్రేడింగ్‌లో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. 30 రోజులు స్టాక్స్‌ కలిగి ఉంటే, మంచి లాభాలు వస్తాయని మరోసారి నమ్మించారు. 30 రోజుల అనంతరం బాధితుడు లాభాలు కలిపి మొత్తం రూ.79 లక్షలు చూపించారు. ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునే ప్రయత్నం చేయడంతో సాధ్యం కాలేదు.విత్‌ డ్రా చేసుకోవాలంటే మరింత డబ్బు పెట్టుబడి పెట్టాలని, కమీషన్‌ ఇతర చార్జీల పేరుతో మరింత డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని ఒత్తిడి చేశారు.

అప్పటికే బాధితుడు మొత్తం రూ.20,75,000 పంపిచడంతో ఇంకా డబ్బు పంపిచడం వీలుకాదని తేల్చిచెప్పడంతో కేటుగాళ్లు బాధితుడి ట్రేడింగ్‌ ఖాతాను కూడా బ్లాక్‌ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించి బాధితుడు నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శివమారుతి తెలిపారు. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?