Breaking News

సైబర్‌ కేటుగాళ్లు.. మహారాష్ట్ర సీఎం పేరుతో రూ.40 లక్షలు కొట్టేశారు

Published on Thu, 08/01/2024 - 20:14

సాక్షి, హైదరాబాద్‌: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పేరుతో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్, హత్య కేసులో కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగిన కేటుగాళ్లు.. ఓ గృహిణి నుండి రూ.40 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన 40 ఏళ్ల గృహిణికి ఫెడెక్స్ కొరియర్ పేరిట కాల్ చేసిన సైబర్‌ నేరగాళ్లు.. ఆమె ఆధార్ నెంబర్‌తో ఎండి.ఎం.ఏ డ్రగ్స్ పార్శిల్‌ వచ్చిందని తెలిపారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు కాల్ ఫార్వార్డ్ చేసినట్లు నమ్మించారు.

అనంతరం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫోటో పంపి, అతనికి ప్రపంచవ్యాప్తంగా సంబంధాలు ఉన్నాయని భయపెట్టారు. తాము చెప్పిన విధంగా డబ్బు పంపించాలని, లేదంటే ఆమె కుటుంబ సభ్యుల ఖాతాలను ఫ్రీజ్ చేసి, వారిని అరెస్టు చేయిస్తామని బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు రూ.40 లక్షలు వారు చెప్పిన ఖాతాకు బదిలీ చేసింది. అనంతరం మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)