Breaking News

బీఆర్‌ఎస్, బీజేపీ పరస్పర దాడులు 

Published on Fri, 08/25/2023 - 03:04

హన్మకొండ: వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడి ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు చేసుకోవడంతో బీజేపీ కార్యకర్తలతోపాటు, పోలీసులకు గాయాలయ్యా­యి. పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ గురువారం హనుమకొండ బాలసముద్రంలోని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ క్యాంపు కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిది. దీంతో పోలీసులు క్యాంపు కార్యాలయానికి వెళ్లే రోడ్లు ముళ్ల కంచెతో మూసివేశారు.

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి నేతృత్వంలో పార్టీనేతలు, కార్యకర్తలు క్యాంపు కార్యాలయ సమీపానికి చేరుకున్నారు. అయితే అప్పటికే బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ముళ్లకంచె వరకు చేరుకుని నినాదాలు చేస్తుండగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కర్రలతో దాడికి దిగడంతో, బీజేపీ కార్యకర్తలు ఆ కర్రలను లాక్కొని ప్రతి దాడికి దిగారు. దీంతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రాళ్ల దాడికి పూనుకోగా బీజేపీ కార్యకర్తలు సైతం రాళ్లతో దాడి చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో పోలీసులతో పాటు, బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అ­నం­తరం పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలను ఆరెస్టు చేశారు. 

బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మకి గాయాలు  
అంతకు ముందు హనుమకొండ హంటర్‌ రోడ్డులోని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ క్యాంపు కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చీఫ్‌విప్‌ క్యాంపు కార్యాలయ ముట్టడికి వస్తున్న పద్మను పోలీసులు అడ్డుకున్న క్రమంలో జరిగిన తోపులాటలో ఆమె స్పృహ తప్పి పడిపోయారు. పోలీసులు పద్మను జుట్టు పట్టి లాగడంతో మెడకు, చేతికి గాయమైంది. అనంతరం పద్మతో పాటు నాయకులు, కార్యకర్తలను ధర్మాసాగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)