Hyd: నిబంధనలు పాటించని పబ్‌లపై కొరడా.. ఆరు పబ్‌లపై కేసులు

Published on Tue, 01/02/2024 - 09:43

సాక్షి, హైదరాబాద్‌: న్యూ ఇయర్‌ వేడుకల రోజు నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. జూబ్లీహిల్స్‌లో ఆరు పబ్బులపై కేసులు నమోదు చేశారు. నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు నడిచిన హలో, టార్‌,గ్రీన్‌ మంకిస్‌, మకవ్‌,లాస్ట్‌, జీనా పబ్బులపై కేసులు నమోదయ్యాయి. 

నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలను పబ్‌ నిర్వాహకులు లెక్కచేయలేదు. అధిక డీజే సౌండ్‌తో స్థానికులను ఇబ్బందిపెట్టినందుకు కూడా కేసు నమోదు చేశారు. భారీ శబ్ధాలు వస్తున్నాయని స్థానికులు ఫిర్యాదు. ఐపీసీ సెక్షన్‌ 188, 290, సీపీ చట్టం కింద కేసు నమోదైంది.

కాగా, కొత్త ఏడాదికి లిక్కర్‌ కిక్కు బాగానే ఎక్కింది. కొత్త సంవత్సర వేడుకల ప్రారంభమయ్యే రోజుతో పాటు రెండు రోజుల ముందు నుంచీ ఏకంగా రూ.620 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్‌షాపులకు చేరింది. డిసెంబర్‌ 31న ఆదివారం సెలవుదినం అయినా, మద్యం డిపోలు తెరచి ఉంచగా, రూ.127 కోట్ల విలువైన మద్యం షాపులకు చేరింది

డిసెంబర్‌ 30న రూ.313 కోట్లు, డిసెంబర్‌ 29న రూ.180 కోట్ల మద్యం డిపోల నుంచి వెళ్లిందని ఎక్సైజ్‌ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కొత్తగా ప్రారంభమైన షాపుల్లో అమ్మకాల కోసం ఈ నెల మొదట్లోనే పెద్ద ఎత్తున లిక్కర్‌ చేరిందని, ఈ నేపథ్యంలో కొంత తగ్గుదల కనిపిస్తుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: నుమాయిష్‌ 2024 ప్రారంభం.. మాస్క్‌ కంపల్సరీ!
 

Videos

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)