Breaking News

విజయవాడ: పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదు

Published on Thu, 07/13/2023 - 09:45

సాక్షి, విజయవాడ: వారాహి యాత్రలో వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అయోధ్య నగర్‌కు చెందిన వలంటీర్‌ దిగమంటి సురేష్ బాబు ఫిర్యాదుతో 153, 153A, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా, వలంటీర్లపై పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. పవన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ విజయవాడ లీగల్‌ సెల్‌ ప్రతినిధులు, పలువురు వలంటీర్లు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌లో డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ (డీసీపీ–అడ్మిన్‌ ) మోకా సత్తిబాబుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 
చదవండి: వలంటీర్లపై దౌర్జన్యకాండ

కోవిడ్‌ బాధితులకు కుటుంబ సభ్యులే దూరంగా ఉన్న తరుణంలో ప్రాణాలకు తెగించి వలంటీర్లు సేవలందించారని వారు గుర్తుచేశారు. ప్రకృతి వైపరీత్యాల్లో సైతం సేవ చేస్తున్నారని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ప్రతి పథకం ప్రజల ముంగిటకే చేరుతోందన్నారు. వలంటీర్లు తలచుకుంటే వారాహి యాత్ర ఒక్క అడుగు ముందుకు సాగదని హెచ్చరించారు. వలంటీర్లకు పవన్‌ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)