MDU Operators: కరోన లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి కష్టపడ్డాం..
Breaking News
జాతరకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
Published on Tue, 03/02/2021 - 09:43
నర్సాపూర్ రూరల్: శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో జరుగుతున్న జాతరకు వెళ్లి దాచారం నుంచి నర్సాపూర్ వైపు బైక్‌పై వస్తుండగా కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందగా, నలుగురు పిల్లలకు తీవ్ర గాయాలైయ్యాయి. ఈ ఘటన సోమవారం నర్సాపూర్– హైదరాబాద్ రహదారిలోని సబ్ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్సై గంగరాజు కథనం మేరకు.. గుమ్మడిదల మండలం దాచారం గ్రామానికి చెందిన సంగని నరేశ్ (26)వరుసకు అల్లుళ్లు అయిన చంటిబాబు (15), లక్ష్మినర్సింహ (12), భానుచందర్ (10), అఖిల్ (8)లను బైక్‌పై ఎక్కించుకొని జాతరకు వెళ్తున్నాడు.
ఈ క్రమంలో నర్సాపూర్ వస్తుండా కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నరేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు పిల్లలకు తీవ్ర గాయాలైయ్యాయి. వీరిని వెంటనే 108 అంబున్స్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడికి భార్య మంజుల ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని నరేశ్ శవాన్ని పోస్టు మార్టం కోసం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనట్లు తెలిపారు.కారు డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
చదవండి : (తండ్రి మృతి..అప్పులు తీర్చలేక కొడుకు ఆత్మహత్య)
(వయసు ఎక్కువ ఉందని విద్యార్థి ఆత్మహత్య)
Tags : 1