Breaking News

ఆరోగ్యం బాగాలేదని.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

Published on Sat, 12/07/2024 - 06:59

దుండిగల్‌: అనుమానాస్పద స్థితిలో బీటెక్‌ విద్యార్థిని హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.  పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండలం మైలారం కొత్త తండాకు చెందిన బలరాం నాయక్, కవితలకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు శ్రావణి (18) దుండిగల్‌లోని మర్రి లక్ష్మారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతూ కళాశాలలోని హాస్టల్‌లో ఉంటోంది. 

రెండు రోజుల క్రితం తన స్వగ్రామానికి వెళ్లి తిరిగి హాస్టల్‌కివచ్చినన శ్రావణి.. శుక్రవారం తన ఆరోగ్యం బాలేదని కళాశాలకు వెళ్లకుండా హాస్టల్లోనే ఉంది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో హాస్టల్‌ గదిలోని తోటి మిత్రులు వచ్చి తలుపులు తట్టినా తీయలేదు. హాస్టల్‌ నిర్వాహకులకు సమాచారాన్ని ఇచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడడంతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే శ్రావణిని సూరారంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 

శ్రావణి తనకు ఆరోగ్యం బాలేదని కడుపునొప్పి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు  సూసైడ్‌ నోట్‌ రాసి ఉందని పోలీసులు తెలిపారు. కాగా.. తమ కుమార్తె శ్రావణి ఎంతో ధైర్యవంతురాలు అని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని హాస్టల్‌ నిర్వాహకులే ఏదో చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ.. కళాశాల ఎదుట మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. దుండిగల్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పి.. ఆందోళనను విరమింపజేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)