Breaking News

కలెక్టర్‌ కార్యాలయం పేరు చెప్పి  బ్యాంక్‌ ఖాతాలు ఖాళీ! 

Published on Fri, 09/16/2022 - 08:52

అనంతపురం శ్రీకంఠం సర్కిల్‌: గుర్తు తెలియని అగంతకుడి చేతిలో ఏఎన్‌ఎం, వలంటీరు ఇద్దరూ మోసపోయారు. ఉన్నతాధికారులు ఫోన్‌ చేశారని భావించి అగంతకుడికి వివరాలు అందజేసి, వారి బ్యాంక్‌ ఖాతాలోని నగదు అపహరణకు కారకులయ్యారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఘటనకు సంబంధించి ఇరువర్గాలు అనంతపురం నాల్గో పట్టణ పోలీసులను ఆశ్రయించాయి.  ఇరువర్గాలను విచారించిన అనంతరం ఇది సైబర్‌ నేరస్తుడి పనిగా సీఐ జాకీర్‌ హుస్సేన్‌ నిర్ధారించారు. గురువారం వివరాలను విలేకరులకు ఆయన వెల్లడించారు.

రుద్రంపేటలోని సచివాలయం–2 పనిచేస్తున్న ఏఎన్‌ఎం ఎర్రమ్మ, వలంటీర్‌ మమతకు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి కలెక్టర్‌ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. కోవిడ్‌తో మృతి చెందిన బాధిత కుటుంబసభ్యులకు అందించే పరిహారం విషయంలో ఫోన్‌ చేశానని, వారి వివరాలు, ఫోన్‌ నంబర్లు ఇవ్వాలని కోరాడు. ఇది నిజమని భావించిన ఏఎన్‌ఎం, వలంటీర్‌ వెంటనే అగంతకుడు అడిగిన సమాచారాన్ని అందజేశారు. ఇదే విషయాన్ని బాధిత కుటుంబసభ్యులకు తెలిపి, కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఫోన్‌ కాల్‌ వస్తే వారు అడిగిన వివరాలు అందజేయాలని సూచించారు.

సచివాలయం సిబ్బంది చెప్పిన ప్రకారమే పామిడి ఓబుళమ్మ మనవరాలు భారతి తనకు వచ్చిన ఫోన్‌ కాల్‌ అందుకుని అవతలి వ్యక్తి అడిగిన వివరాలు అందించింది. కాసేపటికి ఆమె బ్యాంక్‌ ఖాతాలోని రూ.58 వేలు మాయమయ్యాయి. అలాగే కరోనాతో మృతి చెందిన లక్ష్మీనరసమ్మ కుమారుడు మాధవ ఖాతాలో నుంచి రూ.46 వేల కాజేశాడు. ఇరువురి ఖాతాలోనూ నగదు మాయం కావడంతో వారు ఏఎన్‌ఎం, వలంటీర్‌ను నిలదీశారు. తమ బ్యాంక్‌ ఖాతాలోని నగదు కాజేసింది మీరేనంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు, సచివాలయ సిబ్బంది ఉమ్మడిగా నాల్గో పట్టణ పోలీసులను ఆశ్రయించారు.

(చదవండి: ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో అదే హాట్‌ టాపిక్‌)

Videos

బలూచ్ గడ్డపై జెండా పాతిన తొలి హిందూ యువతి

హైదరాబాద్ మెట్రోరైల్ రెండో దశ రెండో భాగం నిర్మించేందుకు కసరత్తు

Miss World Contestants: రామప్ప, వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట సందర్శన

వైఎస్ జగన్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

బయటపడుతున్న తుర్కియే కుట్రలు

నర్సీపట్నంలో బాక్సైట్ తవ్వకాల పేరుతో 2 వేల కోట్ల స్కామ్: పెట్ల ఉమా

భారత జవాన్ ను విడిచిపెట్టిన పాకిస్థాన్

రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారు: NVSS ప్రభాకర్

దేశంలో తాజా భద్రత పరిస్థితులపై సమీక్షించిన సీసీఎస్

చైనా మీడియా సంస్థ ఎక్స్ అకౌంట్ నిలిపివేత

Photos

+5

గంగమ్మ జాతరలో కీలక ఘట్టం..విశ్వరూప దర్శనంలో గంగమ్మ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

దారి వెంట నీరాజనం..‘జై జగన్‌’ అంటూ నినాదాలు (ఫొటోలు)

+5

#MissWorld2025: బ్యూటీ విత్‌ ఫన్‌..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)

+5

చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)

+5

చార్మినార్ దగ్గర మిస్‌ వరల్డ్‌ అందాలభామల ఫోటోషూట్ (ఫొటోలు)

+5

భావితరాలు మీరు ఆదర్శం: భారత సైన్యానికి మోదీ సెల్యూట్ (ఫొటోలు)

+5

హీరో గోపీచంద్ వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)

+5

నిర్మాత ఇషారీ గణేశ్ కూతురి రిసెప్షన్.. హాజరైన స్టార్స్ (ఫొటోలు)