Breaking News

అత్తారింటికి వెళ్తుండగా వెనకే వచ్చిన మృత్యువు.. భార్య, బిడ్డలను చూడకుండానే

Published on Mon, 05/08/2023 - 11:03

తూర్పు గోదావరి: అత్తారింట్లో ఉన్న భార్య, పాపలను చూసి వద్దామని బైక్‌పై బయలు దేరిన బ్యాంకు ఉద్యోగిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ పరిధి గామన్‌ బ్రిడ్జి రోడ్డుపై ఆటోనగర్‌ వద్ద ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి ఎస్సై సుధాకర్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీతానగరం మండలం బొబ్బిల్లంకకు చెందిన చిట్టూరి అజయ్‌ (33) సీతానగరం ఎస్‌బీఐలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. 

అతనికి రెండేళ్ల కిందట వివాహమైంది. 4 నెలల పాప కూడా ఉంది. ఈ క్రమంలో పెదపూడి మండలం కడకుదురులో అత్తారింటి వద్ద ఉన్న భార్య, పాపలను చూసి వద్దామని ఆదివారం ఉదయం ఇంటి నుంచి బైకుపై బయలు దేరాడు. గామన్‌ బ్రిడ్జిపై వెళ్తున్న అతను ఆటోనగర్‌ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి వేగంగా ఢీకొని అతని పైనుంచి వెళ్లిపోయింది. దీంతో శరీరంతో పాటు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్సై సుధాకర్‌ తెలిపారు. వాహనం తలపై నుంచి వెళ్లడంతో ఆ ప్రాంతమంతా రక్తపు మడుగులా మారింది.   

కష్టాలు తీరేవేళ..: ఇద్దరు బిడ్డలు అందివచ్చారు.. కష్టా లు తీరిపోతాయనుకుంటున్న తరుణంలో రోడ్డు ప్రమాదంలో ఇలా జరిగిందంటూ పెద్ద కుమారుడిని కోల్పోయిన ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి తండ్రి బాపన్నకు 10 సెంట్ల భూమి ఉంది. కొంతకాలం కౌలు రైతుగా పనిచేసిన ఆయన వృద్ధాప్యంతో వ్యవసాయం చేయడం లేదు. ఇద్దరు మగ సంతానంలో ఒకరు ఎస్‌బీఐలో, మరొక రు కాటవరం ఆంధ్రా బ్యాంకులో పనిచేస్తున్నారు. అ జయ్‌ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)