Breaking News

అనగాని ఇలాకాలో ఆగని విధ్వంసం

Published on Thu, 06/27/2024 - 04:44

సాక్షి ప్రతినిధి, బాపట్ల:  రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఇలాకా రేపల్లెలో టీడీపీ నేతల విధ్వంసం పతాక స్థాయికి  చేరింది. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. దొరికిన వారిని దొరికినట్లు విచక్షణారహితంగా చితక బాదుతున్నారు. ఊళ్లు వదలి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో ఉంటే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. 

అధికారం అండతో కూటమి నేతలు, ప్రధానంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయి దాడులకు తెగబడుతుండటంతో పలువురు  వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే గ్రామాలు వదిలి వెళ్లారు. కొందరు స్వగ్రామాల్లోనే ఉంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకు తున్నారు. ఏ సమయంలో టీడీపీ నాయకులు దాడి చేస్తారో తెలియక బెంబేలెత్తిపోతున్నారు. చెరుకుపల్లి, నిజాంపట్నం, నగరం మండలాల పరిధిలో ఈ తరహా దాడులు పెరిగాయి.  

విలేకరి ఇల్లు కూల్చివేత 
చెరుకుపల్లి మండలం కస్తూరివారిపేటలో బుధవారం ఉదయం టీడీపీ నేతలు గ్రామానికి చెందిన ఆంధ్రప్రభ విలేకరి యెనుముల వెంకటేశ్వరరావుకు చెందిన ఇంటిని కూల్చివేశారు. వెంకటేశ్వరరావు నాలుగేళ్ల క్రితం 4 సెంట్ల స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నారు. ఇటీవలే గృహప్రవేశం జరిగింది. బుధవారం ఉదయం టీడీపీ నేతలు జేసీబీతో వచ్చి ఆయన ఇంటిని కూల్చివేశారు.

టీడీపీ ఓటు బ్యాంకు అధికంగా ఉన్న గ్రామంలో 225 ఓట్లు వైఎస్సార్‌సీపీకి రావడానికి విలేకరి వెంకటేశ్వరరావే కారణమని టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. కౌంటింగ్‌ అనంతరం ఆయనను బెదిరించిన టీడీపీ నేతలు బుధవారం అతడి ఇంటిని కూల్చివేశారు. గ్రామకంఠం స్థలంలో వెంకటేశ్వరరావు ఇంటిని నిర్మించుకున్నారనేది టీడీపీ ఆరోపణ. అక్కడ దాదాపు 40 కుటుంబాలకు చెందిన వారు జీవనం సాగిస్తున్నారు. పూరిళ్ల స్థానంలో చాలామంది భవనాలు నిర్మించుకున్నారు. 30 సంవత్సరాలుగా విద్యుత్‌  బిల్లులు, పంచాయతీకి ఇంటిపన్ను చెల్లిస్తున్నారు. వెంకటేశ్వరావు మూడేళ్ల క్రితం వేరొకరి వద్ద 4 సెంట్ల స్థలం కొనుగోలుచేసి ఇంటిని నిర్మించుకున్నారు. 

తన ఇంటికి భార్య శ్యామల పేరున విద్యుత్‌ బిల్లు చెల్లిస్తున్నారు. గ్రామ పంచాయతీకి ఇంటిపన్ను చెల్లిస్తున్నారు. ఆక్రమణలు అనుకుంటే అధికారులు అందరిపై చర్యలు తీసుకోవాలి. చట్టవిరుద్ధంగా గృహాలు నిర్మించారనుకుంటే అందరికీ నోటీసులు జారీ చేయాలి. ఆ తర్వాత చట్టపరమైన చర్యలు చేపట్టాలి. కానీ.. టీడీపీ నేతలు జేసీబీతో వెంకటేశ్వరరావు ఇంటిని మాత్రమే కూల్చివేశారు. 

మంత్రి అనగాని సత్యప్రసాద్‌ నియోజకవర్గంలో ఇలాంటి చర్యలు సహేతుకం కాదని పాత్రికేయులు, ప్రజాస్వామిక వాదులు విమర్శిస్తున్నారు. తన ఇంటిని టీడీపీ నేతలు కూల్చివేస్తున్న విషయాన్ని తెలిపేందుకు విలేకరి Ððవెంకటేశ్వరరావు ప్రయతి్నంచినా పోలీసులు స్పందించలేదు. వెంకటేశ్వరరావు ఇంటిని టీడీపీ నేతలు కూల్చడంపై జర్నలిస్ట్‌ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)