Breaking News

నడిరోడ్డుపై దారుణం...వివాహిత పై యువకుడి దాడి

Published on Sat, 05/28/2022 - 07:09

సంతోష్‌నగర్‌: నగరంలో నడిరోడ్డుపై దారుణం జరిగింది. ఓ యువకుడు ప్రేమ పేరిట వివాహితను వేధిస్తూ.. ఆమె ఒప్పుకోకపోవడంతో కత్తితో దాడికి తెగబడ్డాడు. ఇష్టానుసారంగా పొడవడంతో తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన కంచన్‌బాగ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. కంచన్‌బాగ్‌ పరిధిలోని హఫీజ్‌బాబానగర్‌ ఎ–బ్లాక్‌ ప్రాంతానికి చెందిన నూర్‌ భాను (40) భర్త ఇంతియాజ్‌ రెండేళ్ల క్రితం మృతి చెందాడు. ప్రస్తుతం నూర్‌ భాను కుమారుడితో కలిసి నివాసముంటోంది.

కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన షేక్‌ నసీరుద్దీన్‌ ఆలియాస్‌ హబీబ్‌ (32) ప్రేమ పేరుతో ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం నూర్‌ భాను బాబానగర్‌ ఉమర్‌ హోటల్‌ సమీపానికి రాగానే...షేక్‌ నసీరుద్దీన్‌ వెనుక నుంచి యాక్టివా ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె ముఖం, చేతులు, ఇతర ప్రాంతాల్లో కత్తితో దాడి చేశాడు. దీంతో బాధితురాలు అక్కడే స్పృహ కోల్పోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బాధితురాలిని  ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.  చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ బాధితురాలిని నిందితుడికి శిక్షపడేలా చూస్తామని హామీ ఇచ్చిధైర్యం చెప్పారు. ఇదిలా ఉండగా నిందితుడి మీద గతంలో కూడా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా అతడిలో ఎలాంటి మార్పు రాలేదు.  

(చదవండి: ముస్లిం యువతిని ప్రేమించడమే ఆ యువకుడి పాలిట శాపమైందా?)

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)