Breaking News

చదువుల గుడిలో చావు కేకలు!

Published on Sun, 11/01/2026 - 07:08

చదువుల గుడిలో లేదు రక్షణ... పాలకులది ఉదాసీన వీక్షణం! చదువుల తల్లి ఒడిలో నెత్తుటి మడుగులు... కూటమి రాజ్యంలో ఆడపిల్లల గుండెల్లో చావు కేకలు..

కడప రూరల్‌ : ‘ఆడపిల్లల జోలికి వస్తే భయపడాలి‘ అంటూ మైకుల ముందు పాలకులు చెప్పే మాటలు కోటలు దాటుతుంటే, క్షేత్రస్థాయిలో ఉన్మాదుల అరాచకాలు మాత్రం బడుల గడపలు దాటి క్లాస్‌రూమ్‌లలోకి చొరబడుతున్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడు హైస్కూల్లో పదో తరగతి చదువుకునే బాలికపై ఎలక్ట్రిక్‌ రంపంతో జరిగిన రాక్షస దాడి, కూటమి ప్రభుత్వ చేతకానితనానికి, కుప్పకూలిన శాంతిభద్రతలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఎన్నో ఆశలతో, మరెన్నో కలలతో విద్యాసంస్థలకు వెళ్తున్న విద్యారి్థనులకు చావే శరణ్యమనేలా రాష్ట్రంలో మరణ మృదంగం మోగుతుండటంతో యావత్‌ సమాజం తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోతోంది.

చేతగాని పాలన.. అరాచకానికి పరాకాష్ట
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌ పదేపదే శాంతిభద్రతల గురించి ఇచ్చే ఉపన్యాసాలకు, రాష్ట్రంలో రోజురోజుకూ దిగజారుతున్న పరిస్థితులకు ఎక్కడా పొంతన లేకుండా పోయింది. పాలకుల అసమర్థత వల్లే నిందితులకు చట్టాలన్నా, పోలీసులన్నా కనీస భయం లేకుండా పోయింది. ధర్మవరం మండలానికి చెందిన హేమంత్‌ అనే రాక్షసుడు ఏకంగా ప్రభుత్వ బడిలోకి, అదీ క్లాస్‌ రూమ్‌లోకి ఆయుధంతో వచ్చి దాడి చేస్తుంటే అడ్డుకునే నాథుడే కరువయ్యాడు. ఈ దారుణ దాడిలో సదరు బాలిక రక్తపు మడుగులో కుప్పకూలడమే కాకుండా, తోటి విద్యారి్థనులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

విద్యాసంస్థల్లో మరణ మృదంగం
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థినులపై వేధింపులు, దాడులు నిత్యకృత్యంగా మారాయి. ఎంతోమంది ఆడపిల్లలు బలవన్మరణాలకు గురవుతుంటే, మరికొందరు ఇలాంటి ఉన్మాదుల చేతిలో బలైపోతున్నారు. రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు చేతులెత్తేయడంతో, రాష్ట్రంలో క్రూరుల రాజ్యం నడుస్తోందన్న వానద బలంగా వినిపిస్తోంది. బడికి పంపే ఆడపిల్లలు క్షేమంగా తిరిగి ఇంటికి వస్తారా లేదా అన్న భయాందోళనల్లో తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వ చేతకానితనాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

విద్యాశాఖమంత్రి బాధ్యత వహించాలి
ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తాం, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుతామని విద్యాశాఖ మంత్రి లోకేష్‌ ప్రగల్భాలు పలికారు. విద్యార్థుల భవిష్యత్తును.. ప్రభుత్వ విద్యను గాలికి వదిలేశారు. విద్యార్థి సంఘాలకు, ప్రజాస్వామ్యవాదులకు విద్యా సంస్థల ప్రాంగణాల్లోకి అనుమతులు లేకుండా చేశారు. అప్రజాస్వామ్య పరిపాలన సాగిస్తున్నారు. స్కూళ్లు కాలేజీలలో అమ్మాయిలపై జరిగే దాడులకు విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలి.
– జి వలరాజు, రాష్ట్ర అధ్యక్షులు ఏఐఎస్‌ఎఫ్‌

విద్యార్థునుల భద్రతపై ఆందోళన..
రాప్తాడు లో జరిగిన సంఘటన అమానుషం. దీనికి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే కారణం.చదువుకునే అమ్మాయిలకు రక్షణ లేకపోవడం ఆందోళన కలుగుతోంది. పాలకులు మాటలతో మసిపూసి మారేడు కాయ చేయకుండా, శాశ్వత చర్యలు చేపట్టాలి.
– నాగేంద్ర కుమార్, రాష్ట్ర కార్యదర్శి, 
డెమోక్రటీవ్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)