Breaking News

పాక్‌లో దారుణం: అఫ్గాన్‌ దౌత్యవేత్త కుమార్తె కిడ్నాప్‌.. చిత్రహింసలు

Published on Sat, 07/17/2021 - 19:19

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. సామాన్యులనే కాకుండా ఏకంగా దౌత్యవేత్తలపై కూడా దారుణాలకు పాల్పడుతున్నారు అక్కడి నేరస్తులు. తాజాగా పాకిస్తాన్‌లోని అఫ్గాన్‌ దౌత్యవేత్త కుమార్తెను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్‌ చేసి.. చిత్రహింసలకు గురి చేశారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ మేరకు అఫ్గనిస్తాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ లేఖ విడుదల చేసింది. ఆ వివరాలు.. 

పాకిస్తాన్‌లోని అఫ్గాన్‌ దౌత్యవేత్త నజిబుల్లా అలిఖిల్‌ కుమార్తె సిల్‌సిలా అలిఖిల్‌ను కొద్ది రోజుల క్రితం ఇస్లామాబాద్‌లో దుండగులు కిడ్నాప్‌ చేశారు. సూపర్‌మార్కెట్‌ నుంచి ఇంటికి వస్తుండగా దుండగులు ఆమెను ఎత్తుకెళ్లారు. అనంతరం సిల్‌సిలాను చిత్రహింసలకు గురి చేశారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతన్న స్థితిలో ఉండగా వదిలేశారు. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు అఫ్గాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ. విడుదల చేసిన లేఖలో తెలిపింది. 

ఈ చర్యలను అఫ్గాన్‌ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్‌లో ఉన్న తమ దేశ దౌత్యవ్తేతలు, వారి కుటుంబాల భద్రతపై అఫ్గాన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాక సిల్‌సిలాను కిడ్నాప్‌ చేసిన వారిని తక్షణమే అరెస్ట్‌ చేయాలని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అలానే తమ దేశ దౌత్యవేత్తలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని పాక్‌ ప్రభుత్వాన్ని కోరింది. 

పాక్‌-అఫ్గాన్‌ల మధ్య ఏం జరుగుంది.. 
గత కొద్ది వారాలుగా అఫ్గాన్‌లోని పలు జిల్లాలను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మూడోంతుల దేశాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌.. పాక్‌పై ఆరోపణలు చేస్తోంది. ఆ దేశ మద్దతుతోనే తాలిబన్లు తమ దేశంలో అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది.

‘‘స్పిన్ బోల్డాక్ ప్రాంతం నుంచి తాలిబాన్లను తొలగించే చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని’’ పాక్‌ వాయుసేన తమ ఆర్మీని, ఎయిర్‌ ఫోర్స్‌ని హెచ్చరించినట్లు అఫ్గనిస్తాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమ్రుల్లా సాలెహ్‌ తెలిపారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌లోని అఫ్గాన్‌ దౌత్యవేత్తను కుమార్తె కిడ్నాప్‌కు గురి కావడం సంచలనంగా మారింది. 
 

Videos

తిరుమలలో మరో అపచారం

ఈడీపై సుప్రీం ఆగ్రహం

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Photos

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)