Breaking News

భార్యను హత్య చేసి.. పోలీస్‌ కస్టడీ నుంచి తప్పించుకోబోయి..!

Published on Sun, 08/24/2025 - 19:20

న్యూఢిల్లీ:  వరకట్న వేధింపులతో భార్యను హత్య చేసిన ఓ భర్త  పోలీస్‌ కస్టడీ నుంచి తప్పించుకోబోయి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్య నిక్కీ భాటిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న భర్త విపిన్‌ భాటి పోలీసులను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. భార్యను చంపినందుకు ఎటువంటి పశ్చాత్తాపం లేని అతను తప్పించుకోవడానికి ప్లాన్‌ చేశాడు. దాంతో అతని కాళ్లపై పోలీసులు కాల్పులు జరపడంతో గాయాలపాలయ్యాడు. అతన్ని సఫ్దార్‌ జంగ్‌ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పరిధిలో గ్రేటర్‌ నోయిడాలోవిపిన్‌ భాటి అనే 28 ఏళ్ల వ్యక్తి.. భార్య నిక్కీ భాటిని దారుణంగా హత్య చేయడంలో కీలక పాత్ర పోషించాడు.  విపిన్‌ భాటి అతని తల్లి దండ్రులతో కలిసి భార్య నిక్కీ భాటిని హత్య చేశాడు. ఆమె ఒంటికి నిప్పంటించి దారుణంగా హత్య చేశారు.

ఈ ఘటన గురువారం( ఆగస్టు 21వ తేదీన) జరగ్గా ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. తన కూతుర్ని పొట్టన పెట్టుకున్న వారిని కాల్చి చంపాలని ఆమె తండ్రి డిమాండ్‌ చేశాడు. అయితే డిమాండ్‌ చేసిన గంటల వ్యవధిలోనే విపిన్‌ భాటి తప్పించుకోబోయి పోలీస్‌ కాల్పుల బారిన పడ్డాడు. 

కాగా, మరింత కట్నం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, భర్త,  అత్తమామలు కలసి 28 ఏళ్ల నిక్కీ అనే మహిళ ఒంటికి నిప్పంటించి, ఆమె ప్రాణాలను బలిగొన్నారని గ్రేటర్‌ నోయిడా పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంలో పోటీసులు మృతురాలు నిక్కి భర్త భర్త విపిన్ భాటీ (28)ని అరెస్టు చేయగా, అతని తండ్రి సత్యవీర్ భాటి, సోదరుడు రోహిత్ భాటి పరారీలో ఉన్నారు. తన సోదరి నిక్కీని అత్తామామలు ఏళ్ల తరబడి వేధిస్తున్నారని కాంచన్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగు చూసింది.

ఈ దారుణం ఆగస్టు 21న కాస్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్సా గ్రామంలో చోటుచేసుకుంది. నిక్కీని కట్నంగా రూ.35 లక్షలు తీసుకురావాలంటూ వేధిస్తున్నారేది ప్రధాన ఆరోపణ.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)