Breaking News

యువతిపై హత్యాయత్నం కేసులో ప్రేమోన్మాది అరెస్ట్‌

Published on Tue, 12/10/2024 - 06:21

కడప అర్బన్‌ : వైఎస్సార్‌ జిల్లా వేముల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో యువతిపై హత్యా యత్యానికి పాల్పడిన పేమోన్మాదిని అరెస్ట్‌ చేసినట్టు జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. సోమవారం కడపలో మీడియాకు వివరాలు వెల్లడించారు. వేముల మండలానికి చెందిన కుళ్లా­యప్ప కొంతకాలంగా యువతి వెంట పడుతు­న్నాడు.

ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపలికి ప్రవేశించి కత్తితో యువతిపై విచక్షణ రహితంగా దాడి చేసి పారిపాయాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు వేముల ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. 

అయితే గ్రామస్తులు తనను కొట్టి చంపుతారేమోనని భయపడిన నిందితుడు గ్రామ సమీపాన గల కొండల్లో ఉండి చనిపోవాలనుకుని కత్తితో చేయి కోసుకున్నాడు. ఆ తర్వాత పోలీసులు పట్టుకుంటారేమోనని భయపడి తప్పించుకోవడానికి హైదరాబాద్‌ వెళుతుండగా పోలీసుల చేతికి చిక్కాడు. దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్పినట్టు ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు వివరించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)