Breaking News

ఆటోను ఢీకొట్టిన ట్రక్కు.. ఏడుగురు మృతి

Published on Tue, 09/24/2024 - 19:58

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాహోహ్‌ జిల్లాలో మంగళవారం ట్రక్కు, ఆటో రిక్షా ఢీకొన్నాయి, ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు మరణించగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. సామాన్న గ్రామ సమీపంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని జబల్‌పూర్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దామోహ్‌ ఎస్పీ శృతికీర్తి సోమవంశీ మాట్లాడుతూ.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ట్రక్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, అతడు మద్యం సేవించి వాహనం నడిపాడా లేదా అని  విచారిస్తున్నట్లు  చెప్పారు.

మృతులను గుర్తించే పని జరుగుతోందని తెలిపారు. ఆటో డ్రైవర్‌కు కూడా గాయాలు అవ్వగా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. నిందితుడు ట్రక్‌ డ్రైవర్‌పై దేహత్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ విషాద సంఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి అన్ని విధాలుగా సహాయం అందించాలని జిల్లా యంత్రాంగం, పోలీసులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ .2 లక్షలు, గాయపడిన వారికి ఆర్థిక సాయం కింద రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)