Breaking News

విజయవాడలో ఒకే ఫొటోతో ఏకంగా 658 సిమ్‌కార్డులు..

Published on Wed, 08/09/2023 - 11:29

సాక్షి, విజయవాడ: నగరంలో సిమ్‌కార్డుల దందా వెలుగులోకి వచ్చింది. గుణదలలో ఒకే ఫొటోతో ఏకంగా 658 సిమ్‌కార్డులు జారీ కావడం కలకలం రేగుతోంది. డాట్‌ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యునికేషన్స్‌) ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాలని సూర్యారావుపేట పోలీసులను సీపీ రానా ఆదేశించారు. దర్యాప్తులో భాగంగా ఒకే ఫొటోతో ఓ నెట్‌వర్క్‌ సంస్థకు 658 సిమ్‌లను అమ్మినట్లు పోలీసులు గుర్తించారు.

సత్యనారాయణపురానికి చెందిన నవీన్‌ అనే యువకుడు ఈ సిమ్ కార్డుల్ని రిజిస్టర్‌ చేసినట్లు గుర్తించారు. అజిత్‌సింగ్‌నగర్‌, విస్సన్నపేట పోలీస్‌స్టేషన్ల పరిధిలో మరో 150 వరకు సిమ్‌ కార్డులు నకిలీ పత్రాలతో జారీ చేసినట్లు గుర్తించారు. సిమ్‌ కార్డుల మోసాలను అరికట్టేందుకు టెలి కమ్యూనికేషన్ శాఖ ప్రత్యేకంగా ఓ వ్యవస్థను తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌‌తో పనిచేసే ఓ టూల్ కిట్ ద్వారా సిమ్ కార్డుల దందా బయటపడింది.
చదవండి: నా భార్య దొంగతనాలు చేస్తోంది.. 

\

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ ఫేసియల్‌ రికగ్నేషన్‌ వెరిఫికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా సిమ్‌కార్డు మోసాలను గుర్తించారు. ఈ సిమ్‌లు ఎక్కడికి వెళ్లాయి.. ఎవరు వినియోగిస్తున్నారన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు