Breaking News

ఆశ్చర్యపోయాను!.. శ్రీధర్ వెంబు ట్వీట్

Published on Fri, 01/09/2026 - 16:39

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో విస్తరిస్తున్న తరుణంలో.. జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు ఒక ట్వీట్ చేశారు. కృత్రిమ మేధస్సు (AI).. సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తోందని ఇందులో ఒక ఉదాహరణతో వివరించారు.

సంస్థలోని R&D బృందంలో పనిచేసే ఇంజనీర్.. నెల రోజుల తన ఖాళీ సమయంలో తయారు చేసిన ఒక పరికరాన్ని నాకు చూపించారు. అతను దానిని తయారు చేస్తున్నట్లు నాకు తెలియదు. కానీ దానిని చూడగానే నేను ఆశ్చర్యపోయాను.

మూడు లేదా నలుగురు వ్యక్తులు.. ఆ పరికరాన్ని తయారు చేయడానికి కనీసం ఒక ఏడాది సమయం పడుతుంది. కానీ అతను కేవలం నెల రోజుల్లోనే దాన్ని అభివృద్ధి చేశారు. ఇంత వేగంగా దీనిని రూపొందించడానికి ప్రధాన కారణం Opus 4.5 అనే AI మోడల్ అని ఆ ఇంజనీర్ చెప్పారు.

ఒకప్పుడు ఏఐ ద్వారా రాసే కోడ్‌పై అతనికి (ఇంజినీర్) అంతగా నమ్మకం లేదు. కానీ Opus 4.5 వచ్చాక తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని వెంబు వివరించారు. అంతే కాకుండా జోహో కంపెనీలో ప్రయోగాత్మక సంస్కృతిని ప్రస్తావించారు. మేము సంస్థలో తెలివైన వాళ్లకు స్వేచ్ఛ ఇస్తాం, వాళ్లే కొత్త మార్గాలు కనుగొంటారని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు.

ఇంతవరకు సాఫ్ట్‌వేర్ అప్డేట్ అనేది చేతితో నేసే చేనేత (Handloom) లాంటిదైతే, ఇప్పుడు AI రూపంలో శక్తివంతమైన యంత్ర మగ్గాలు (Machine Looms) వచ్చేశాయని అన్నారు. ఇది సాఫ్ట్‌వేర్ కంపెనీల మీద పెద్ద ప్రభావం చూపిస్తుంది. జోహో కూడా దీనికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను చీఫ్ సైంటిస్ట్‌గా ఉన్నందున ఈ మార్పులను ఎదుర్కోవాల్సిన బాధ్యత తనపై ఉందని వెంబు వెల్లడించారు.

Videos

పెద్దపల్లి జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

జగన్ పేరు వింటే మీ ముగ్గురికి కలలో కూడా ఇది పడుతుంది

ఎవరూ అధైర్య పడకండి.. మన వెనుక జగనన్న ఉన్నాడు

సినిమా రిజల్ట్ ఒక్కరోజులోనే డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు

ABN కాదు TDP ఛానల్ అని పెట్టుకోండి.. రాధాకృష్ణ, వెంకట్ కృష్ణను అరెస్ట్ చెయ్యాలి

మా రోజమ్మ గురించి పిచ్చి పిచ్చిగా వాగితే.. జనసేన నేతలకు YSRCP నేతలు వార్నింగ్

24 గంటలే టైమ్ ఇస్తున్నా.. మీ భరతం పడతా బిడ్డా

తప్పిపోయిన పాపను చేరదీసిన మంత్రి సీతక్క

బంగారాన్ని వెండి మించిపోతుందా? వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఏం చెప్పారు?

థియేటర్లు బ్లాస్ట్ అయిపోతాయి

Photos

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ (ఫోటోలు)

+5

Anasuya: మొన్నటిదాకా ట్రెండీగా.. ఇప్పుడు ట్రెడిషనల్‌గా (ఫోటోలు)

+5

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

సంక్రాంతికి.. సొంతూరికి.. (ఫోటోలు)

+5

రంగవల్లికలు.. సప్తవర్ణ మల్లికలై (ఫోటోలు)

+5

'ది రాజా సాబ్‌' స్పెషల్‌ మీట్‌లో సందడిగా చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

మిసెస్‌ ఇండియా పోటీల్లో మెరిసిన తెలంగాణ క్వీన్స్ (ఫోటోలు)

+5

సంక్రాంతి జోష్‌.. వాహనాల రద్దీతో రోడ్లు ఫుల్‌ (ఫొటోలు)

+5

సాక్షి-ఎస్పీఆర్‌ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు (ఫోటోలు)