Breaking News

‘అధిక సంఖ్యలో టీకాల వల్ల పిల్లల్లో ఆటిజం’

Published on Tue, 10/28/2025 - 16:14

పిల్లలకు మితిమీరిన సంఖ్యలో ఇస్తోన్న టీకాల వల్ల ఆటిజం కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ఇటీవల చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. భారతదేశంలో ఆటిజం కేసులు పెరుగుతున్నాయని, దీనికి తల్లిదండ్రులు పిల్లలకు ఇప్పిస్తున్న టీకాలు కూడా కారణమని వెంబు ఎక్స్(గతంలో ట్విట్టర్) వేదికగా అభిప్రాయపడ్డారు.

వెంబు ఈ వ్యాఖ్యలు చేస్తూ మెక్ కలౌ ఫౌండేషన్ నివేదిక ఫలితాలను ఉటంకించారు. 300కు పైగా అధ్యయనాలను సమీక్షించి రూపొందించిన ఈ నివేదికలో రెండేళ్లలోపు పిల్లలకు సుమారు 32 టీకాలు వేయిస్తున్నట్లు చెప్పారు. ఇది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD)కు కారణమవుతున్నట్లు తెలిపారు. వెంబు తన పోస్ట్‌లో ‘తల్లిదండ్రులు ఈ విశ్లేషణను తీవ్రంగా పరిగణించాలి. చిన్న పిల్లలకు మితిమీరిన సంఖ్యలో టీకాలు ఇస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఇది భారతదేశంలో కూడా వ్యాపిస్తోంది. ఇండియాలోనూ ఆటిజం వేగంగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది’ అని పేర్కొన్నారు.

వెంబు వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో చర్చకు దారితీశాయి. కొందరు నెటిజన్లు ఆయన పోస్ట్‌కు మద్దతు తెలుపుతూ ‘ఈ మెసేజ్‌ను పంపడానికి చాలా ధైర్యం కావాలి’ అని ప్రశంసించగా, మరికొందరు టీకాల ఆవశ్యకతను, అవి ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో పోషించిన పాత్రను నొక్కి చెబుతూ విమర్శిస్తున్నారు.

ఆటిజం అంటే ఏమిటి?

ఆటిజం అనేది ఒక న్యూరోడెవలప్‌మెంటల్ డిజార్డర్ (మెదడు అభివృద్ధికి సంబంధించిన సమస్య). దీన్ని సాధారణంగా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) అని పిలుస్తారు. ఇందులో స్పెక్ట్రమ్ అనే పదం ఈ వ్యాధి లక్షణాలు, తీవ్రత వ్యక్తినిబట్టి వైవిధ్యంగా ఉంటాయని సూచిస్తుంది. ఆటిజం లక్షణాలు సాధారణంగా చిన్న వయస్సులోనే (సాధారణంగా 2 సంవత్సరాల వయస్సులోపు) బయటపడుతాయి. తల్లిదండ్రులు లేదా ఇతరులు పేరు పెట్టి పిలిచినా స్పందించకపోవడం, ఇతరుల భావాలను అర్థం చేసుకోలేకపోవడం లేదా వాటిని పంచుకోలేకపోవడం, ముఖ కవళికలను ఉపయోగించడంలో ఇబ్బంది పడటం వంటి లక్షణాలు ఆటిజంలో భాగంగా ఉన్నాయి.

ఇదీ చదవండి: ఎలాన్ మస్క్ టెస్లాకు బై..బై?

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)