ఆడుతూ.. పాడుతూ.. డబ్బు పాఠాలు

Published on Thu, 06/05/2025 - 14:31

పిల్లలకు ఆర్థిక అక్షరాస్యత నేర్పించడం చాలా ముఖ్యం. ఈ వేసవి సేలవుల్లో తల్లిదండ్రులు విభిన్న వయసు కలిగిన పిల్లలు, యువతకు వైవిధ్యంగా, ఆకర్షణీయంగా డబ్బుకు సంబంధించిన అంశాలను తెలియజేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో మనీ మేనేజ్‌మెంట్‌ విషయాలపై బలమైన పునాది నిర్మిస్తే పొదుపు, దీర్ఘకాలంలో సమకూరే ప్రయోజనాలపై స్పష్టత ఏర్పడుతుంది. వయసు వారీగా పిల్లలకు ఎలా డబ్బు అంశాలు తెలియజేయాలో చూసేద్దాం.

వయసు 3–5 ఏళ్లు

నాణేలు, కరెన్సీని గుర్తించడంపై అవగాహన కల్పించాలి. డబ్బు ద్వారా  వస్తువులను కొనుగోలు చేయవచ్చని అర్థం చేయించేలా అవసరాలు, ఆ అవసరాల మధ్య తేడాను గుర్తించేలా చెప్పేందుకు ప్రయత్నించాలి. కథలు చెప్పడం, ఆడించడం లేదా నాటకం రూపంలో దుకాణంలో వస్తువులను కొనుగోలు చేయడం, డబ్బు ఇవ్వడం, తీసుకోవడం.. వంటి వాటిని తెలియజేయాలి.

వయసు 6–13

పొదుపు చేయడం, ఖర్చు చేయడం, ఈ రెండింటి మధ్య తేడాలు, ఖర్చు అధికమైతే కలిగే నష్టాలను చెప్పాలి. బేసిక్ బడ్జెటింగ్ సూత్రాలు చెప్పాలి. పిల్లలు ఏదైనా వస్తువు కొనాలంటే డబ్బు ఎలా వస్తుందో చెబుతూ.. ఇంట్లో చిన్నచిన్న పనులు చేయమని చెప్పాలి. అందుకు కొంత మొత్తంలో డబ్బు ఇవ్వండి. దాంతో రెండు ప్రయోజనాలుంటాయి. డబ్బు సంపాదించేందుకు ఎంత కష్టపడాలో తెలుస్తుంది. దాన్ని ఎలా ఖర్చు చేయాలో ఆలోచిస్తారు. అనవసర వస్తువులకు డబ్బు ఖర్చు చేసిన తర్వాత ఏదైనా అత్యవసర సమయాల్లో మనీ కావాలంటే మళ్లీ కష్టపడాల్సి వస్తుందనే భావనను తెలియజేయాలి. పొదుపుపై అవగాహన పెంచాలి. డబ్బును కిట్టీ బ్యాంకులో జమ చేయడం అలవాటు చేయాలి.

టీనేజ్ (14+)

క్రెడిట్, వడ్డీ, పెట్టుబడి, పన్నుల గురించి చర్చించాలి. బ్యాంక్ స్టేట్‌మెంట్‌ చదవడం లేదా యాప్‌లు, స్ప్రెడ్ షీట్‌లను ఉపయోగించి ఖర్చులను ట్రాక్ చేయడం ఎలాగో నేర్పించాలి.

షాపింగ్ వెళ్తున్నారా..

వేసవి సెలవులు ఇంకొన్ని రోజుల్లో ముగుస్తాయి. పుస్తకాలు, బట్టలు ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు పిల్లలు తల్లిదండ్రులతో షాపింగ్‌మాళ్లకు వెళ్తుంటారు. దుకాణాల వద్ద ధరలను గమనించాలి. డిస్కౌంట్లను చర్చించాలి. బ్రాండ్లలో ఉండే తేడాలు పరిశీలించాలి. లోకల్‌ షాపులోనూ అదే తరహా వస్తువులు లభిస్తాయి. కానీ రెండింటి మధ్య తేడాలేమిటో అడిగి తెలుసుకోవాలి. ఇతర దేశాల వస్తువులపై ఏమేరకు పన్నులు విధిస్తున్నారో తెలుసుకోవాలి. ఆ పన్నుల వల్ల కంపెనీలు, వినియోగదారులపై కలిగే ప్రభావాలను గమనించాలి.

ఇదీ చదవండి: బెస్ట్‌ క్యాష్‌ బ్యాక్‌, రివార్డు పాయింట్లు ఇచ్చే క్రెడిట్‌ కార్డులు

పిల్లలు బడ్జెట్ తయారు చేసుకోవాలి. బడ్జెట్‌ సమయంలో 50-30-20 నియమాన్ని పాటించాలి. అంటే నిత్యం అవసరాల కోసం చేసే తప్పనిసరి ఖర్చుకు మొత్త రాబడిలో 50 శాతం, కోరికల కోసం 30 శాతం, పొదుపునకు మరో 20 శాతం కేటాయించాలి. కుటుంబ బడ్జెట్‌ రాసేప్పుడు పిల్లలను కూడా అందులో భాగస్వామ్యం కావాలి.

Videos

తెలంగాణ కుంభమేళా.. మేడారంకు క్యూ కట్టిన భక్తులు

రామ్ చరణ్, సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్

ఐర్లాండ్ లో వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు

ఎవరి మక్కెలు ఇరగదీస్తావ్..? పవన్ పై కారుమూరి వెంకట్ రెడ్డి ఫైర్

2019 రియల్టర్ హత్య కేసు.. CBI అదుపులో DK ఫ్యామిలీ

పేకాట డాన్లుగా.. టీడీపీ నేతలు

ఏం పీకుతామా!.. జగన్ వచ్చాక తెలుస్తది

చావును జయిస్తా.. ఏడాదికి 166 కోట్లు

లోకేష్ బూతులకు YSRCP పగిలిపోయే రిప్లే

ఫ్యాక్టరీ యాజమాన్యం దొంగ దెబ్బ! బంగ్లాదేశ్ హిందూ హత్య కేసులో సంచలన విషయాలు

Photos

+5

పూల డ్రస్‌లో మెరిసిపోతున్న సంయుక్త (ఫొటోలు)

+5

నిర్మాత బర్త్ డే.. బాలీవుడ్ అంతా ఇక్కడే కనిపించారు (ఫొటోలు)

+5

కూటమి పాలనలో పెన్షన్ల కోసం దివ్యాంగుల కష్టాలు (ఫొటోలు)

+5

'దండోరా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

క్రిస్మస్‌ కళ.. అందంగా ముస్తాబైన చర్చిలు (ఫొటోలు)

+5

దుల్కర్ సల్మాన్ పెళ్లిరోజు.. భార్య గురించి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి తర్వాత సమంత ఎలా మెరిసిపోతుందో చూశారా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోషన్, కమెడియన్ రఘు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో క్తీరి సురేశ్ హంగామా (ఫొటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రెస్ మీట్ లో డింపుల్ హయాతి (ఫొటోలు)