Breaking News

లేదని బాధపడకు.. వశం చేసుకోవాలని ఆరాటపడు!

Published on Sat, 07/05/2025 - 18:29

డబ్బు లేదని బాధపడడం కంటే దాన్ని ఎలా వశం చేసుకోవాలనే దాని గురించి ఆలోచించేవారి సంఖ్య తగ్గుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు తమ ఆర్థిక పరిమితులు ఇంతేనని.. తమ జీవితాలు ఏం చేసినా బాగోవు..అనే ధోరణికి వచ్చేస్తున్నారు. ఇందుకు బదులుగా పాజిటివ్‌ దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యతరగతివారు ఆర్థిక అంశాలపట్ల తమ నమ్మకాలను పరిమితంగా ఉంచుకుంటారని ఇన్వెస్టర్, పోర్ట్ఫోలియో స్ట్రాటజిస్ట్ శ్యామ్ శేఖర్ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఆ మనస్తత్వం నుంచి ఎలా బయటపడాలో కనీసం ఆలోచించేందుకు సైతం వారు నిరాకరిస్తున్నారని చెప్పారు.

శ్యామ్ శేఖర్ ఎక్స్‌లో తెలిపిన వివరాల ప్రకారం..‘మధ్యతరగతి కుటుంబాలు తమ మనస్తత్వం మర్చుకోవు. అందుకే ఆర్థికంగా ఎదగలేవు. కనీసం ఆ దిశగా ఆలోచించడానికిసైతం నిరాకరిస్తారు. ఇంట్లో ఎయిర్ కండీషనర్, కారు ఉండాలని కలలు కనే మధ్యతరగతి కుటుంబాలు చాలా ఉన్నాయి. అయితే ఈ అవసరాలు నిజంగా తమ సామర్థ్యాలతో పోలిస్తే చాలా తక్కువ. అయితే ఉన్న పరిధిలో ఆర్థికంగా పుంజుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయరు. కాబట్టి ఈ అవసరాలే వారికి పెద్ద లక్ష్యాలుగా తోస్తాయి’ అన్నారు.

ఇదీ చదవండి: ఉద్యోగుల్లో వేతన సంక్షోభం

‘డబ్బు సంపాదనను కాంపౌండింగ్ దృష్టితో చూడాలి. దీర్ఘకాలంలో భారీ సంపద చేకూర్చే మార్గాలను కనుగొనాలి. ఇలాంటి ఆలోచనలతో మీరు జీవితాన్ని చాలా భిన్నంగా చూడటం ప్రారంభిస్తారు. రూ.కోటి చేరువలో ఉన్న వ్యక్తి రూ.20 కోట్లకు సులువుగా చేరుకోవచ్చు. కాంపౌండింగ్‌తో ఇది సాధ్యమే. దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చే సంపదను సృష్టిస్తే తరాలు అది కొనసాగుతోంది. పర్సనల్‌ ఫైనాన్స్‌పై పరిమిత ఆలోచనల నుంచి బయటకురావాలి’ అన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)