Breaking News

జాబ్‌ రావాలంటే క్రెడిట్‌ స్కోరే కీలకం.. కంపెనీల్లో కొత్త ధోరణి..

Published on Sun, 06/08/2025 - 12:19

సాంకేతిక పురోగతి, మారుతున్న సంస్థల అవసరాలతో ఉద్యోగ అన్వేషణ తీరులో వేగంగా మార్పులు జరిగిపోతున్నాయి. ఉద్యోగార్థుల అర్హతలను నిర్ణయించడానికి కంపెనీలు రెజ్యూమెలు, ఇంటర్వ్యూలను దాటి వెతుకుతున్నాయి. చాలా సంస్థలు ఇప్పుడు అభ్యర్థుల ఆర్థిక నేపథ్యాన్ని అంచనా వేయడానికి వారి క్రెడిట్ స్కోర్‌ను కూడా తనిఖీ చేస్తున్నాయి. ఇది నేరుగా ఉద్యోగ పనితీరుతో సంబంధం లేనప్పటికీ, అభ్యర్థి ఆర్థిక క్రమశిక్షణ, విశ్వసనీయతకు సూచికగా క్రెడిట్‌ స్కోర్‌ను యాజమాన్యాలు పరిగణిస్తున్నాయి.

అయితే ప్రతి కంపెనీ ఉద్యోగార్థుల క్రెడిట్ హిస్టరీని తనిఖీ చేయదు కానీ, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కొన్ని ప్రభుత్వ సంస్థలు మాత్రం ఈ వైఖరిని అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఫైనాన్స్, బ్యాంకింగ్, అకౌంటింగ్ లేదా సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరమయ్యే ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తుంటే నియామక ప్రక్రియలో భాగంగా మీ క్రెడిట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసకునే అవకాశం ఉంది. ఈ రోజుల్లో చాలా కంపెనీలు అభ్యర్థుల నేపథ్యాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ఈ కసరత్తును నిర్వహించడానికి థర్డ్ పార్టీ ఏజెన్సీలను సైతం నియమించుకుంటున్నాయి.

జాబ్‌ అప్లికేషన్‌పై క్రెడిట్ స్కోర్ ప్రభావం
క్రెడిట్ స్కోర్ అనేది మూడు అంకెల సంఖ్య, దీనిని ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వడానికి తరచుగా ఉపయోగిస్తాయి. ఇది 300 నుండి 900 మధ్య ఉంటుంది. క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే, అనుకూలమైన వడ్డీ రేటుతో రుణాలు త్వరగా ఆమోదం పొందే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. ఇది మీ రుణ అర్హత గురించి రుణదాతకు హామీ ఇస్తుంది. మీరు తీసుకున్న మొత్తాన్ని ఎటువంటి డిఫాల్ట్ లేకుండా సకాలంలో తిరిగి చెల్లంచగలరు అనే నమ్మకాన్ని కలిగిస్తుంది.

  • మీకు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే, మీరు రుణం లేదా క్రెడిట్ కార్డు చెల్లింపులను మిస్ అయ్యారని, అవసరానికి మించి అప్పు తీసుకున్నారని లేదా రుణాలను డిఫాల్ట్ చేశారని చూపిస్తుంది. దీని వల్ల డబ్బు దొంగిలించడం, డేటా లీక్ చేయడం లేదా మోసానికి పాల్పడటం వంటి విషయాలకు మీరు ఎక్కువగా గురవుతారని కంపెనీ యజమాన్యం అనుకోవచ్చు.

  • ఒక కంపెనీ మీ క్రెడిట్ హిస్టరీని చెక్‌ చేసిందంటే.. మీరు రుణాలు, క్రెడిట్ కార్డులు, బిల్లు చెల్లింపులను ఎంత బాగా నిర్వహించారు వంటి మీ గత ఆర్థిక ప్రవర్తనను చూస్తోందని అర్థం. మీరు అప్పుల్లో ఉంటే, మీరు మీ ఆర్థిక వ్యవహారాలను సరిగ్గా నిర్వహించడం లేదని ఇది సూచిస్తుంది.

👉ఇదీ చదవండి: టీనేజ్‌ అప్పులు.. తీరని తిప్పలు!

  • తక్కువ క్రెడిట్ స్కోర్ మీరు పనిలో చాలా పరధ్యానంలో ఉన్నారనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఇది తప్పులు చేయడానికి, గడువులను కోల్పోవటానికి దారితీస్తుంది. ఆర్థిక విషయాలను నిర్వహించే పాత్రలకు, మీరు సరైన వ్యక్తి కాదని కంపెనీలు భావించవచ్చు.

  • క్రెడిట్ స్కోరు మీ ఉద్యోగ దరఖాస్తును నేరుగా ప్రభావితం చేయదు కానీ, కొన్నిసార్లు ఇది కొన్ని రంగాలలో నియామక నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ఫైనాన్షియల్ సెక్టార్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సున్నితమైన ఆర్థిక విషయాలను బాధ్యతాయుతంగా నిర్వహించగలరని భరోసా ఇవ్వడానికి తమ క్రెడిట్ స్కోర్‌ను షేర్‌ చేయాలని కంపెనీలు అడగవచ్చు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)