Breaking News

ఎలాన్‌ మస్క్‌ క్రియేటర్లకు వందల కోట్లు చెల్లిస్తున్నారు.. మీరు తీసుకున్నారా?

Published on Sun, 10/01/2023 - 08:20

ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ‘ఎక్స్‌ (ట్విటర్‌)’ యూజర్లకు శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు ఎక్స్‌ క్రియేటర్లకు సుమారు 20 మిలియన్లు (రూ.166 కోట్ల కంటే ఎక్కువ) చెల్లించినట్లు ఆ కంపెనీ సీఈవో లిండా యక్కరినో తెలిపారు. వెరిఫైడ్ యూజర్ల పోస్టులపై డిస్‌ప్లే అయ్యే యాడ్స్‌ ద్వారా సంస్థ సంపాదించిన మొత్తంలో కొంత భాగాన్ని ఈ ఏడాది జూలై నుంచి క్రియేటర్లకు చెల్లించడం ప్రారంభించింది.

యూట్యూబ్‌లో వీడియోలకు, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులకు, వెబ్‌సైట్‌లలో ఆర్టికల్స్‌కు డబ్బులు వస్తాయి. అదే తరహాలో ఎక్స్‌.కామ్‌ సైతం ట్వీట్‌లకు డబ్బులు ఇస్తున్నట్లు అధినేత ఎలాన్‌ మస్క్‌ తెలిపిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో అర్హులైన క్రియేటర్లకు ఆ మొత్తాన్ని చెల్లించినట్లు సీఈవో లిండా ట్వీట్‌ చేశారు. 

‘క్రియేట్‌,కనెక్ట్‌, కలెక్ట్‌ ఆల్‌ ఆన్‌ ఎక్స్‌’. క్రియేటర్లు ఆర్ధికంగా విజయం సాధించేలా వారికి అండగా నిలిస్తున్నాం ’అని యాకారినో పోస్ట్ చేశారు. అంతేకాదు, ఇప్పటికే క్రియేటర్‌ కమ్యూనిటీకి 20 మిలియన్లు చెల్లించాం. తొలిసారిగా జులై నెలలో 5 మిలియన్లు అందించినట్లు తెలిపారు. 

యాక్టీవ్‌గా ఉన్న క్రియేటర్లు డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని ఎక్స్‌.కామ్‌ కల్పిస్తుంది. మానిటైజేషన్‌ నిబంధనలకు లోబడి చేసే ట్వీట్‌లకు క్రియేటర్లు ‘యాడ్స్‌ రెవెన్యూ షేరింగ్‌ ప్రోగ్రామ్‌’ కింద భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన క్రియేటర్లు  డబ్బులు సంపాదించుకోవచ్చు.  

క్రియేటర్ యాడ్స్ రెవెన్యూ షేరింగ్ (ట్వీట్‌లతో డబ్బులు) సంపాదించేందుకు క్రియేటర్లు ఎక్స్‌ ప్రీమియం సభ్యుడై ఉండాలి. గత 5 నెలల్లో మీరు చేసిన పోస్ట్ లపై కనీసం 3 మిలియన్ ఆర్గానిక్ ఇంప్రెషన్స్, కనీసం 500 మంది ఫాలోవర్లను కలిగి ఉండాలి.

చదవండి👉 ఎంతపని చేశావయ్యా ఎలన్‌ మస్క్‌?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)