Breaking News

రేపటి నుంచి వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా ఈవెంట్‌ 

Published on Wed, 09/24/2025 - 05:20

న్యూఢిల్లీ: నాలుగో విడత వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సెపె్టంబర్‌ 25న (రేపు) ప్రారంభించనున్నారు. దేశీయంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త ఆవిష్కరణలకు గ్లోబల్‌ హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ శాఖ మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ తెలిపారు.  న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో రష్యన్‌ ఫెడరేషన్‌ ఉప ప్రధాని దిమిత్రీ ప్యాట్రిòÙవ్‌తో పాటు కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తదితరులు పాల్గోనున్నారు.

 న్యూజిలాండ్, సౌదీ అరేబియా భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 21 దేశాలు పాల్గొంటున్నాయి. 2023లో నిర్వహించిన ఈవెంట్‌లో రూ. 33,000 కోట్ల విలువ చేసే అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదిరాయి. 2024లో ప్రధానంగా టెక్నాలజీ బదలాయింపు ఒప్పందాలపై దృష్టి పెట్టారు. గత ఎడిషన్ల దన్నుతో ఈసారి మరింత భారీగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు పాశ్వాన్‌ తెలిపారు. ప్రాసెస్డ్‌ ఆహారం వల్ల స్థూలకాయం, ఇతరత్రా అనారోగ్యాలు వస్తాయనే అపోహలను పారద్రోలేందుకు ఉద్దేశించిన బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)