Breaking News

రాబోయేది నిశ్శబ్దంగా నలిపేసే సంక్షోభం!

Published on Wed, 09/02/2026 - 13:33

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ టి.కియోసాకి తన ఫేస్‌బుక్ ఖాతా వేదికగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై సంచలన విశ్లేషణ చేశారు. ప్రపంచం ఎదుర్కోబోయే తదుపరి ఆర్థిక సంక్షోభం గతంలో చూసిన రూపంలో ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. అది నిశ్శబ్దంగా ఆర్థికంగా ప్రజలను నలిపేస్తుందన్నారు.

కియోసాకి మాటల్లోనే ఆ విశ్లేషణ

అందరూ తదుపరి ఆర్థిక సంక్షోభం 2008 నాటి పరిస్థితుల్లా ఉంటుందని భావిస్తున్నారు. మార్కెట్లలో తీవ్ర భయాందోళనలు, రాత్రికి రాత్రే బ్యాంకులు మూతపడటం వంటివి చూస్తామని అనుకుంటున్నారు. కానీ, ఈ తదుపరి ఆర్థిక సంక్షోభం అలా ఉండదు. ఇది చాలా నిశ్శబ్దంగా వస్తుంది. ఇది ప్రజల్లో ఒక రకమైన తీవ్రమైన అలసటలా అనిపిస్తుంది.

ప్రజలు ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు. కాగితాలపై ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం మరింత వెనుకబడిపోతున్నారు. ఇది సాధారణ విషయం కాదు.. ఇదొక హెచ్చరిక సంకేతం. 60 శాతం మంది అమెరికన్లు ప్రతి నెలా వచ్చే జీతంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ కూలిపోవడం లేదు, అది ఒత్తిడికి గురవుతోంది. ఆ భారాన్ని అప్పుల ద్వారా మోస్తున్నారు. క్రెడిట్ కార్డులు, 'బై నౌ పే లేటర్' ఆఫర్లు, స్టూడెంట్ లోన్లు, మినిమమ్ పేమెంట్లు సమస్యలను పరిష్కరించవు. కేవలం బాధను వాయిదా వేస్తాయి. వాయిదా పడిన బాధ మాయమైపోదు, అది వడ్డీతో సహా పెరుగుతుంది.

ఖర్చులకు రుణాలు..

అందుకే ఈ సంక్షోభం నాటకీయంగా అనిపించదు. ఇది శాశ్వతమైన ఒత్తిడిలా, ఆర్థికంగా ఎటువంటి మిగులు లేని స్థితిలా మారుతుంది. ప్రజలు భయపడటం లేదు, అలసిపోతున్నారు. ఇది మరింత ప్రమాదకరం. ఎందుకంటే ప్రజలు భయపడినప్పుడు తిరుగుబాటు చేస్తారు. కానీ అలసిపోయినప్పుడు వ్యవస్థకు లొంగిపోతారు. వారేం చేస్తారు? వేరే దారి లేక మళ్లీ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తారు. పిల్లల ఖర్చుల కోసం రుణాలు తీసుకుంటారు. అద్దె పెరిగినందుకు రెండో షిఫ్ట్ ఉద్యోగం చేస్తారు. ఆ క్రమంలో ఆర్థిక వ్యవస్థ భారీగా కూలిపోనక్కర్లేదు. అది చాలా నిశ్శబ్దంగా, సమర్థవంతంగా మీ శ్రమను పిండేస్తుంది.

పొదుపు పెరగదు, అప్పు తగ్గదు

ఆర్థిక వ్యవస్థ కూలిపోవడానికి అలజడి అక్కర్లేదు. కోలుకునే అవకాశం లేకపోతే చాలు. పొదుపు పెరగదు, అప్పు తగ్గదు. కేవలం మీరు చేసే నిరంతర శ్రమకు ఫలితం తగ్గుతూ వస్తుంది. మీరు అనుభవిస్తున్నది ఇదే. రాబోయే సంక్షోభం సైరన్లతో రాదు, అది ఇప్పటికే మానసిక బర్నౌట్ రూపంలో మన ఇంట్లోకి వచ్చింది. దాన్ని మీరు సరైన సమయంలో గుర్తిస్తారా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న.

ఇదీ చదవండి: కుప్పకూలిన బంగారు కొండ!

Videos

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో

వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

ఆపిల్ ల‌వ‌ర్స్‌కు గుడ్‌న్యూస్ ఐఫోన్ 18..కొత్త డేట్ ప్రీ బుకింగ్ ఆర్డ‌ర్ చేసుకోండి

భయపడకండి మీకు నేనున్నా... అంబటి సురేష్ కుటుంబానికి ధైర్యం చెప్పిన జగన్

థియేటర్స్ దందాకు చెక్ Seat వద్దకే ఫుడ్ డెలివరీ..

నేపాల్ నీళ్ల పాలు.. ఊళ్లను ఊడ్చేసిన వరదలు

సర్కార్ పై గులాబీ సమరం

Photos

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)