Breaking News

డీజిల్‌లో ఐసోబుటనాల్: కేంద్రమంత్రి కీలక ప్రకటన

Published on Sat, 09/13/2025 - 14:43

ఇప్పటి వరకు ఈ20 పెట్రోల్ గురించి చెప్పిన నితిన్ గడ్కరీ.. తాజాగా ఐసోబుటనాల్ గురించి పేర్కొన్నారు. డీజిల్‌లో 10 శాతం ఐసోబుటనాల్‌ను కలపడానికి ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) కృషి చేస్తోందని కేంద్ర రవాణా శాఖమంత్రి అన్నారు.

ఇండియా షుగర్ అండ్ బయో-ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ISMA) వార్షిక సమావేశంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. డీజిల్‌లో పదో వంతు ఇథనాల్‌ను కలపడంపై జరిగిన ట్రయల్స్ విజయవంతం కాలేదు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా.. ఐసోబుటనాల్ మిశ్రమం ఉపయోగించాలని అన్నారు. ఐసోబుటనాల్ అనేది మండే లక్షణాలతో కూడిన ఆల్కహాలిక్ సమ్మేళనం. దీనిని డీజిల్‌తో పాటు ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు ఉంటాయని ఆయన అన్నారు.

ఈ20 పెట్రోల్‌పై తప్పుడు ప్రచారం..
ఈ20 పెట్రోల్ వినియోగంపై వస్తున్న వదంతులు అంతా.. తప్పుడు ప్రచారమని గడ్కరీ అన్నారు. ఇథనాల్ వినియోగం పెరిగితే.. ఇంధన దిగుమతులు తగ్గుతాయి. దీనివల్ల దేశ ఆర్ధిక పరిస్థితి కూడా కొంత పెరుగుతుంది, రైతుల ఆదాయం పెంచడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతి జీతం సున్నా.. అయితే ఆదాయం ఎలా?

భారతదేశంలో ఇథనాల్ అనేది ఎక్కువగా చెరకు మొలాసిస్ నుంచి ఉత్పత్తి అవుతుంది. మొక్కజొన్న, బియ్యం, దెబ్బతిన్న ఆహార ధాన్యాలు వంటి వనరులను కూడా ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో మొక్కజొన్న ఉత్పత్తిని మూడు రెట్లు పెంచుతుందని మంత్రి అన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)