Breaking News

హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్‌ ఉద్యోగాల్లోకి మహిళలు.. పురుషులను మించి..

Published on Wed, 05/14/2025 - 18:33

ముంబై: అన్ని రంగాల్లో పురుషుల ఆధిపత్యానికి చెక్‌ చెబుతూ మహిళలు పురోగమిస్తున్నారు. తాజాగా హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్‌ పరిశ్రమలోనూ ఈ ధోరణి కనిపిస్తోంది. గతేడాది ఈ రంగంలో ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు 26 శాతం పెరిగినట్లు జాబ్‌ పోర్టల్‌ వర్క్‌ఇండియా ఒక నివేదికలో తెలిపింది.

హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్‌ ఉద్యోగాలకు సంబంధించి పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు 19 శాతమే పెరిగినట్లు పేర్కొంది. ఇక పార్ట్‌టైమ్‌ ఉద్యోగాల కోసం మహిళల నుంచి దరఖాస్తులు పెరిగినట్లు వివరించింది. తృతీయ శ్రేణి పట్టణాల నుంచి కూడా అప్లికేషన్లు వస్తున్నప్పటికీ, ప్రథమ శ్రేణి మార్కెట్లలోనే ఎక్కువగా ఉద్యోగాలు ఉంటున్నట్లు వర్క్‌ఇండియా తెలిపింది.

పురుషులకు మాత్రమే పరిమితమైన రంగాల్లోకి మహిళలు ప్రవేశించే కొద్దీ భవిష్యత్తులో ఇంజినీరింగ్‌ను పునర్విర్వచించే మార్పులు చోటు చేసుకుంటున్నాయని వర్క్‌ఇండియా సీఈవో నీలేష్‌ దుంగార్వాల్‌ తెలిపారు. పోర్టల్‌లో మొత్తం మీద టెక్‌ ఉద్యోగాల పోస్టింగ్స్‌ 11 శాతం పెరగ్గా, హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్‌ లిస్టింగ్స్‌ మాత్రం 26 శాతం ఎగిసినట్లు వివరించారు.

Videos

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)